Saturday, September 15, 2018

అన్న బలరామ్ వేసెను ఛూమ్ మంత్రం

బలరామ్ ;- చెప్పిన మాట వినవు కదా ; 
ఉన్న మాటంటే ఉలుకు నీకు ; 
మన్ను బొక్కుట నీ అలవాటు ;
తెగ బొక్కుట నీ అలవాటు ;
మిన్నుల నీలపు వన్నె క్రిష్ణుడా! ;  || 
;
క్రిష్ణ ;- ఐతే అమ్మకు చెప్పుట నీ అలవాటే, 
అన్నా, చాడీలు చెప్పుట నీకలవాటే,  
హన్నా అంటూ నా చెవిని ; 
మెలితిప్పినది అమ్మ యశోద, 
అమ్మా! ఇంకా నా ఈ చెవి నొప్పి ;  || 
; &
కృష్ణ ;- నల్లని వాని ఇరు కర్ణములు ; 
ఎర్రని రంగున - వింతగున్నవిలే భలేగా,
అనుచూ నా నేస్తాలు హేళన చేతురు ; 
గున్నమామిడి తోపుల వద్ద ఎగతాళి  చేతురు ;  || 
;
బలరామ ;- ఛూమ్ మంత్రం వేస్తాను, 
సరేనా, కన్నయ్యా ; 
కాకీ కాకీ - కలవల కాకీ ; 
మా తమ్ముని బాధను ఎత్తుకు పో! ;  
అంటూ అన్నయ - బలరామన్నయ్య ; 
వేసెను ఉత్తుత్తి  మంత్రం ; 
చిటికెలొ రోదన మటుమాయం ; 
అన్నదమ్ములు ఆటలు సందడి ; 
వెన్నెల విందులు బహు పసందులు ;  || 
;        
==========================;
;
ceppina maaTa winawu kadaa ; 
unna maaTamTE uluku neeku ; 
mannu bokkuTa nee alawATu ;
tega bokkuTa nee alawATu ; 
minnula neelapu wanniya krishNuDA! ;  || 
;
krishNa ;- aitE ammaku ceppuTa nee alawaaTE, 
annaa, ceppuTa neekalawaaTE : 
hannaa amTU naa cewini ;

melitippinadi amma yaSOda, 
ammaa! imkaa naa ee cewi noppi ;  || 
& ;-
] kRshaNa ;- nallaniwaani iru karNamulu ; 
errani ramguna - wimtagunnawilE BalEgA ;
anucuu naa nEstaalu hELana cEturu ; 
gunnamaamiDi tOpula wadda egatALi  cEturu ;  || 
;
balaraama ;- Cuumm mamtram wEstaanu, 
sarEnaa, kannayyaa ; 
kaakee kaakee ; kalawala kaakee ; 
maa tammuni baadhanu ; 
ettuku pO!"  amTU 
annaya - balaraamannayya ; 
wEsenu uttutti  mamtram ; 
ciTikelo rOdana maTumAyam ; 
annadammulu aaTalu samdaDi ; 
wennela wimdulu bahu pasamdulu ;  || 
;

No comments:

Post a Comment