Wednesday, September 12, 2018

'పున్నమి బుగ్గల' తళుకుల రేకులు

రాధా రమణీ దరహాసాలు ; 
'పున్నమి బుగ్గల' తళుకుల రేకులు ; 
క్రీగంటి చూపులవి - మన రాధమ్మవి ;  ||
;
తొలి పొద్దు నింగికి అలదేను ; 
ఈలాగున ఎన్నో కెంపు వన్నియలను ; 
తొలి పొద్దు నింగికి అలదేను నేడు ;  
ఈలాగున ఎన్నెన్నో కెంపు వన్నెలు ; || 
;
అవని పరికించింది -  అటుకేసి చూసింది- 
"ఆ వచ్చునది ఎవ్వరని?" ;
అట తటాలున సాక్షాత్కరించేను ...... ; 
మన శ్యామ కృష్ణుడు ; 
నిఖిల లోకమ్ములకు ,
అతడు కనువెలుగు ;  ||  
;
క్రిష్ణ రాధల జంట ;
జగతి కన్నుల పంట ; 
నిప్పచ్చరములైన ఎడదలకు ;
పన్నీటి తేట ;  || 

==============;
;
raadhaaramaNI darahaasaalu ; 
'punnami buggala' taLukula rEkulu ; 
kreegamTi cuupulawi - 
mana raadhammawi ;  || 
;
toli poddu nimgiki aladEnu ; 
eelaaguna ennO kempu wanniyalanu ; 
toli poddu nimgiki aladEnu nEDu ;  
eelaaguna ennennO kempu wannelu ; ||  
;
awani parikimcimdi - aTukEsi  cuusimdi ;
- "A waccunadi ewwarani?" ;
aTa taTAluna saakshaatkarimcEnu ....... ; 
mana SyAma kRshNuDu ; 
nikhila lOkammulaku ataDu kanuwelugu ;  || 
;
krishNa raadhala jamTa ;
jagati kannula pamTa ; 
nippaccaramulaina eDalaku ;
panneeTi tETa ;  ||
;

No comments:

Post a Comment