Friday, September 14, 2018

మృదుల గీతిక

రాగాల వాహినిలొ ; ఒక మృదుల గీతిక ; 
ఆ క్రిష్ణ మురళీ రవళి - రవల చుక్కానియే ;
కూనిరాగమేల రాధికా!? లోలోన అట్లాగ -  
నీవే కద - శ్రీకృష్ణ ప్రేమ - సామ్రాజ్య ఏలిక  ;
- ||సాగనీయవోయి ఝరిలో ;
వలపు నావ - 
ఊసులన్ని ఝల్ ఝల్లన ;
సాగనీయి మును ముందుకు|| 
;
వనితా మానస వాసి ;
ప్రణయ గృహ నివాసి నీవే కద శ్రీకృష్ణా! 
మ్రోగించుము నీ వంశీ ; 
;
యమునా తిన్నెలపై లీలా విహారి ; 
ఖుషి ఖుషిగా ప్రతి చలనం ;
నీదు హేల మురళి రవళి - 
రవల చుక్కానియే ; 
వాహినిలో  అటు పడవకు  - 
ఇటు పువుబోణికి ; 
మురళి రవళి - చుక్కాని, దిక్సూచి ;
- || సాగనీయవోయి ఝరిలో ||
;
'కుందరదన  రాధిక మేలిముసుగు  తెమ్మెర ;  
తెరచాప చందములే - అంటేను ; 
వెన్నెల నగవులు శతములు ; 
వెదజల్లుతారమ్మా ; 
ముసిముసిగా వెదజల్లుతారమ్మా ; 
అటు మిన్నుల కలువలరేడు -
ఇటు తిన్నెల పింఛధారి ;
- || సాగనీయవోయి ఝరిలో ||
;  
======================; ;
;
raagaala waahinilo ; oka mRdula geetika ; 
aa krishNa muraLI rawaLi - rawala cukkaaniyE ;
kuuniraagamEla raadhikA!? lOlOna aTlaaga -  
neewE kada - 
SreekRishNa prEma - saamraajya Elika  ;
- ||saaganeeyawOyi jharilO ;
walapu naawa - 
uusulanni jhal jhallana ;
saaganeeyi munu munduku|| 
;
wanitaa maanasa waasi ;
praNaya gRha niwaaasi neewE kada SreekRshNA!
mrOgimcumu nee wamSI ; 
;
yamunaa tinnelapai leelaa wihaari ; 
khushi khushigaa prati calanam ;
needu hEla muraLi rawaLi - 
rawala cukkaaniyE ; 
waaahinilO  aTu paDawaku  - 
iTu puwubONiki ; 
muraLi rawaLi - cukkaani, diksuuci ;
- || saaganeeyawOyi jharilO||
;
'kumdaradana  raadhika mElimusugu  temmera ;  
teracaapa camdamulE - amTEnu ; 
wennela nagawulu Satamulu ; 
wedajallutaarammaa ; 
musimusigaa wedajallutaarammaa ; 
aTu minnula kaluwalarEDu -
iTu tinnela pimCadhaari ;
- || saaganeeyawOyi jharilO||

No comments:

Post a Comment