Saturday, August 17, 2013

సీతమ్మ వారి జడ కుచ్చుల పూలు

సీతమ్మ వారి జడ కుచ్చు పూలు; 
మా తోటలోన  విరబూసినాయి;
మహ మంచిపువ్వులు; ఈ సీతమ్మ పూవులు;  || సీత ||  
;   
ముఖమల్లు పూలు, మెత్తన్ని పూలు; 
మహమల్లు పూలు, మహరాణీ పువ్వులు
మహలులందందున మురిపించే మెత్తన్ని పూలు ; 
మహ మంచి ఈ సీతమ్మ పూవులు  || సీత ||
;
సూర్య కాంతి మెరసేటి సొంపైన పువ్వాయిలు;          
పూరేకులన్నీ వెల్వెట్టు జారు; 
గుడిసెలందు, వాడలందు, గుడి ఆవరణలలోన; 
వీధులందు, అరుగు పక్క; అందాలై జాల్వారు;  || సీత ||    
;
మిసిమి కోమలమ్ములీ ఏక దళ పుష్పములు ;   
చూడ చూడ ; కిత కితలౌ - ద్వి దళముల సౌరులు; ;  
సీతమ్మ నవ్వులకు చక్కనైన గూళ్ళు || సీత ||    
పువ్వుల్లు తల్లి మొక్క కెంతో మోదమ్ములు; 
కొమ్మ కొమ్మన పూసిన సన్నాయి లోలె  
తోచేను ఈ సీతమ్మ జడ గంటల పూలు || సీత ||         
;
ఈ మొక్క శ్రీరామ చంద్రులకు; 
మనసారా ఇచ్చేనీ మనసైన పుష్పాలను; 
ఈ సీతమ్మ జడ కుప్పెపూలు ||  


************************************,


;


;
సీతమ్మ జడ గంటల పూలు;

53032 -  konamaanini views;