Friday, September 14, 2018

స్మిత వదన

జరీ బుటా అవగుంఠనము ధరియించెను రాధిక ;
ఆ వలిపెమ్ము వెనుక ; స్మిత వదనం, సిరి సిరి ;
రాధమ్మ - స్మిత వదనం ; సిరి సిరి  ;  ||
;
మేలిముసుగు వెనుక మిన్నంటిన అందము ;
చల్లనైన చందనముల చందము ; 
ఆ అందము , ఆ చందము ఎచ్చటివమ్మా!?
అవి, చెరకు వింటి వేలుపు మన్మధుని కానుకలు  ;  ||
;
ఆమె వెనుక అపరంజి నవ్వులు ;
ఆ నవ్వుల తొణుకులు - ఎక్కడి నుండి!?
ఆ పువ్వుల చెణుకులు - ఎవ్వరివమ్మా!?  ;
అవి, వేరెవరివి ఔతాయి, 
మురిపాల ముద్దుల మన కన్నయ్యవేనమ్మా  ;  || 
;
================;
;
jaree buTA awagumThanamu -
dhariyimcenu raadhika ;
aa walipemmu wenuka ;
smita wadanam ; siri siri ;
raadhamma - smita wadanam ; siri siri  ;  ||
;
mElimusugu wenuka minnamTina amdamu ;
callanaina camdanamula camdamu ;
aa amdamu , aa camdamu eccaTiwammaa!? ;
awi, ceraku wimTi wElupu manmadhuni kaanukalu ;  ||
;
aame wenuka aparamji nawwulu ; 
aa nawwul toNukulu - ekkaDi numDi!?
aa puwwula ceNukulu - ewwariwammaa!?  ;
awi, wErewariwi autaayi, 
muripaala mddula 
mana kannayyawEnammaa ;  || 
;
రాధమ్మ అవగుంఠనం ;

No comments:

Post a Comment