Tuesday, October 28, 2014

వల్లంకి పిట్ట బోధనలు

వల్లంకి పిట్టా! 
          వల్లంకి పిట్టా! 
రెక్కల్ని విప్పార్చి, 
చక్కంగ రావే!
చిరుగాలికి కథలు; 
చంద-మామకు పద్యాలు  
బోధించుమోయీ! ||
  
ఉయ్యాల జంపాల 
కేరింతలాడే
చిన్నారి చెవిలోన 
కమ్మని కథలను,
ఆశువుగ పద్దెములు,
మురిపాల ఊసులను 
            తొణికించవోయీ! ||  

వల్లంకి పిట్టా! వల్లంకి పిట్టా! 
రెక్కల్ని విప్పార్చి, 
చక్కంగ రావే!

********************,
 వస్త్ర ప్రపంచం -  ఓణీ డిజైనులు 











wallamki piTTA! 
wallamki piTTA! 
rekkalni wippaarchi, 
chakkamga raawE! || 

chirugaaliki kathalu; 
chamdamaamaku padyyaalu 
uyyaala jampaala kErimtalaaDE
chinnaari chewilOna 
kammani kathalanu;
ASuwuga paddemulu,

muripaala uusulanu 
toNikimchawOyI! ||

wallamki piTTA! wallamki piTTA! 
rekkalni wippaarchi, 
chakkamga raawE! || 

********************,
అఖిలవనిత
Pageview chart 28264 pageviews - 737 posts, last published on Oct 25, 2014
Telugu Ratna Malika
Pageview chart 3779 pageviews - 121 posts, last published on Oct 24, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53805 pageviews - 999 posts, last published on Oct 21, 2014 - 2 followers

Saturday, October 25, 2014

వానా వానా వల్లప్ప!

వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా!
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు!  ||

తిరిగి తిరుగు ఆటలు
తిరుగు తిరుగు ఆటలు
తారంగం పాటలు!
జలతరంగిణీ ఆటలు ॥  

'వాన చుక్క టప్పు టప్పు!
తడవకండి, తప్పు తప్పు
పడిసెం, జలుబులు కలుగును
తడవకండి, తప్పు తప్పు'

తప్పంటే ఆగేరా
ఈ అల్లరి పిల్లలు!?
ఆనక ఆ పెద్దలే
అవుతారు పిల్లలుగా

వాన వానా వల్లప్ప
వల్లప్పకు ఆహాహా
దొరికినవీ కానుకలు
కోకొల్లల వేడుకలు  ||

*******************,
 window curtains- designs  












వానల వానా వల్లప్ప (link - web magazine)
Written by kusuma kumari; 18 October 2014 

Thursday, October 23, 2014

ప్రకృతిమాతకు వందనము

వానా వానా వల్లప్పా!
వల్లమాలిన గుబులప్పా!
మబ్బుల తెప్పల పడవలలో; 
తళ తళ మెరుపుల కలువలను; 
తెచ్చేవారు యక్ష  కన్యకలు; 

పచ్చని పైరుల కొంగులను; 
విరజాపి, పుచ్చుకునేది భూదేవి;
సంతోషాలను సకలజగతికీ; 
ఇచ్చేనమ్మా వనరుగ ప్రకృతి; 
ఇస్తీనమ్మా వాయనం; 
పుచ్చుకొంటినీ వాయినం   

**********************,

designs for sheets 













waanaa waanaa wallappaa!; 
wallamaalina gubulappaa!
mabbula teppala paDawalalO; 
taLa taLa merupula kaluwalanu; 
techchEwaaru yaksha  kanyakalu; 

pachchani pairula komgulanu; 
wirajaapi, puchchukunEdi bhuudEwi; 

samtOshAlanu sakalajagatikii; 
ichchErammaa wanaruga prakRti; 
istiinammaa waayanam; 
puchchukomTinii waayinam   
prakRtimaataku wamdanamu;  

**********************,

Telugu Ratna Malika
Pageview chart 3768 pageviews - 120 posts, last published on Oct 21, 2014
అఖిలవనిత
Pageview chart 28234 pageviews - 735 posts, last published on Oct 21, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53703 pageviews - 998 posts, last published on Oct 21, 2014 - 2 followers 

Tuesday, October 21, 2014

హ్యాపీ దీపావళి

చిరునవ్వులకు మేలిమి పసిడి చిరునామా;
విచ్చేసింది దీపావళి; వచ్చేసింది దీపావళి;
Happy diwali  Happy Happy dipAwaLi ||

ఇంతులు, పిల్లలు, పురుషులు, పెద్దలు;
చేతులు కలిపిన చప్పట్లు; ఆనందాల హడావుడి;
ఔ నండీ! ఇది దీపావళి, దివ్య దీపావళి ||

భాషాభేదాల్, విద్వేషాలను;
మరిపించే ప్రమిదల పండుగ - దీపావళి||
మతాబాలతో బాతాఖానీ!
రవ్వలజిలుగుల హంగామా - దీపావళి||

వెలుగుల కులుకులు;
తళుకుల హొయలులు;
ఇలపై తారలు దిగి వచ్చేటి;
దివ్య పర్వము దీపావళి||  
;
Happy Diwali 













తమాషా హమేషా దీపావళి ;
Happy Happy దీపావళి!
హ్యాపీ హ్యాపీ దీపావళి

Thursday, October 16, 2014

కిరణ ప్రభలు - పింఛములు

ప్రత్యూషకు తొలి కిరణాల ఈకలు; 
పురి విప్పిన బర్హి పింఛములు; 
తూర్పు దిశ నవ బృందావనము; 
జడత్వమున కునుకులిడే, 
మనస్సులకు చైతన్యపు ఆటలను నేర్పే 
ఒజ్జ (గురువు) ఐనది ప్రకృతి.

#pratyuushaku toli kiraNAla Ikalu; 
tuurpu diSa nawa bRmdaawanamu;
jaDatwamuna kunukuliDE, 
manassulaku chaitanyapu aaTalanu nErpE 
ojja (guruwu) ainadi prakRti.#

{కాదంబరి కుసుమాంబ)

*************************,

నెమలి పింఛములు; కిరణ ప్రభలు పింఛములు
;

cloth designs 















Telugu Ratna Malika
Pageview chart 3758 pageviews - 119 posts, last published on Oct 15, 2014
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 28178 pageviews - 733 posts, last published on Oct 15, 2014
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53487 pageviews - 996 posts, last published on Sep 30, 2014 - 2 followers

Wednesday, October 15, 2014

వెన్నెలల చందనాల బొమ్మలు

చందమామ తెచ్చెనమ్మ చందనాల వెన్నెలలు
వెన్నెలల చందనాల హత్తుకున్న బొమ్మలు
అవి ఎవ్వరివమ్మా? అవి ఎవ్వరివమ్మా? ;                 ||చందమామ ||                          

మిత్రులను వెక్కిరించి, అన్నయ్యను గోకి          
పొన్నచెట్టు కొమ్మలలో దాగినాడు క్రిష్ణుడు        
పొదరిళ్ళలోన నక్కినక్కి నవ్వేటి క్రిష్ణుని                                            
తనివితీర చూడాలని తహతహలా జాబిలికి;                ||చందమామ ||                            

"అల్లరి మానాలంటూ" ఆకతాయి క్రిష్ణుని                  
తల్లి జనని యశోదమ్మ తర్జనిని చూపించి                    
రేపల్లెల గోపెమ్మల కొంగులందు దోబూచి      
ఆటలాడ తనతోటి తహతహలు జాబిల్లికి ;                  ||చందమామ ||                        

యమున అలల నేస్తాలతొ, ఈదులాటలో నేర్పరి          
నీలినీలి కెరటాలలొ కాళీయుని వేదిక పై  
రస తాండవమాడేటీ నీలమోహన కృష్ణుని                                
తనివితీర చూడాలని తహతహలు జాబిల్లికి;                ||చందమామ ||

********************************,

Member Categories - బాల, web magazine, newaavakaaya  (LINK)
Written by kusuma kumari ; Tuesday, 07 October 2014 10:03 ;Hits: 122

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

cloth designs













అఖిలవనిత
Pageview chart 28167 pageviews - 732 posts, last published on Oct 10, 2014
Telugu Ratna Malika
Pageview chart 3755 pageviews - 117 posts, last published on Oct 1, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం

Pageview chart 53485 pageviews - 996 posts, last published on Sep 30, 2014 - 2 followers  

Friday, October 10, 2014

బంగరు బొమ్మా! మా అమ్మా!

మా అమ్మా అని: నేను పిలిచితే:
మాటాడరాదా, నాతోటి, ఓ అంబా! ||

1) న్యాయమా మీనాక్షి తాయీ!
నిను వినా వేరె దిక్కెవ్వరున్నారు మా అమ్మా! ||

2) సరసిజభవ, హరిహరనుత; సులలిత :
నీ పద పంకజమ్ములె స్థిరమని నమ్మితిని:
కరుణ జూడవే! కాత్యాయని కాళి భవాని! ||

3) పరమేశ్వరి సుందరేశు రాణి:
బాలాంబా మధుర వాణి ||

4) వినుత జన పాపమోచని,
ఓ జననీ! శ్రీ ఘననీలవేణీ!!
విదళిత దానవమండలదమనీ, దామిని! ||

5) వనజలోచనా! సుధా+కరాననా! వరదాయకి!
అనయము నిను కోరి యున్నానమ్మా!
బంగరు బొమ్మా! మా అమ్మా!
బంగారు బొమ్మా! మా అమ్మా!! ॥ 

*******************************,

#maa ammaa ani: nEnu pilichitE:
maaTADaraadA, naatOTi, O ambaa! ||
1)nyaayamaa miinaakshi taayI!
ninu winaa wEre dikkewwarunnaari maa ammaa! ||
2) sarasijabhawa, hariharanuta;
sulalita : nii pada pamkajammule:
sthiramani nammitini!!!!
karuNa juuDawE!
kaatyaayani kaaLi bhawaani! ||
3)paramESwari sumdarESu raaNi:
baalaambaa madhura waaNi ||
4) winuta jana paapamOchani,
O jananii! Srii GananiilawENI!!
widaLita daanawamamDaladamanii, daamini! ||
5) wanajalOchanaa! sudhaa+karaananaa! waradaayaki!
anayamu ninu kOri yunnaanammaa!
bamgaru bommaa! maa ammaa!! ||           

 #               ***************
శ్యామశాస్త్రి కీర్తనలు











{శ్యామశాస్త్రి కీర్తనలు;  
కావ్య కాదంబరికుసుమాంబ గ్రూపు 2014 septembar}

అఖిలవనిత
Pageview chart 28095 pageviews - 731 posts, last published on Oct 1, 2014
Create new postGo to post listView blog
Telugu Ratna Malika
Pageview chart 3728 pageviews - 117 posts, last published on Oct 1, 2014
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53402 pageviews - 996 posts, last published on Sep 30, 2014 - 2 followers

{శ్యామశాస్త్రి కీర్తనలు;  
కావ్య కాదంబరికుసుమాంబ గ్రూపు 2014 septembar}

Wednesday, October 1, 2014

రాగరాగిణి

షోడశోపచారముల వెలుగులల్లికలు; 
అల్లిబిల్లిగ మాదు ఆహ్లాదములు కోటి
నీ సన్నిధి తల్లి! అనుగ్రహము వీటిక!*  ||  

ఊసులకు నీవు మౌనవీణియవు; 
మౌనములకు నీవు రాగరాగిణివి;  
లాలిత్యకళలకు మహదేవి! మూలమైనావు || 

నీ కాలిమువ్వలు చతుష్షష్ఠి నెలవుల్లు;  
గజ్జెలు, అందియలు, మువ్వల ముచ్చటల; 
పదహారులోకముల బొమ్మల కొలువు || 

*********************************,

వీటిక* = వీడు = ప్రాంతము -
"కొండవీడు", హలైబీడు, & 
మునివాటిక - మొదలైన పదావళి         

గోముగా అడిగేము!

హైమవతి! గౌరీ!పరమేశ్వరీ! 
అర్ధనారీశ్వరీ! జగదీశ్వరీ! 
జయ జయ జోతలు 
జయ జయ జోతలు  || 

గోముగా అడిగేము! ఈ పగిదిని;
చందనము చలువల ప్రేమావధుల 
విస్తారమైనట్టి చిత్రలేఖలుగా
మల్లియల తావుల ఘుమఘుమల రీతిగా ; 
మార్చుమా ఈ సృష్టిని! 
శ్రీశక్తి! పార్వతీ! పరమేశ్వరీ! ||  

ఈరేడు లోకములు మత్తు నిద్దుర వీడ 
నీ వీక్షణములను ప్రసరించవమ్మా! ||
నీ చల్లనిచూపులవెన్నెలలు విప్పార;  
నెమలి ఆయెను జగతి; నాట్యచైతన్యాల ప్రగతి ||

కదంబముల తోపులో నటరాజదేవేరి;
ఆడుతూ పాడుతూ సాగేవు పూ దారి;
కన్నతల్లివి నీవు విమల విశ్వాలకు; 
మా - బహు పరాకులను 
వైళమే శ్రీమాత! అందుకోవమ్మా! ||  

*****************************,


  














కాదంబరికుసుమాంబ  కాదంబరికుసుమాంబ  
Telugu Ratna Malika
Pageview chart 3715 pageviews - 117 posts, last published on Oct 1, 2014
Create new postGo to post listView blog
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 53174 pageviews - 996 posts, last published on Sep 30, 2014 - 2 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 27997 pageviews - 729 posts, last published on Sep 30, 2014