Friday, September 14, 2018

గాలి చెవులు మెలితిప్పి వేణువులో కూర్చిన ప్రజ్ఞ

గాలి చెవులు మెలి త్రిప్పి ; 
వేణువులో కూరినావు ; 
ఆహాహా! నీ చేష్ఠలు, చిలిపి చర్యలు ;  || 
;
కొండగాలి ఏమో అదుపు లేనిది ;
ఎండ గాలి సెగలు, పొగలు ఎగజిమ్మేను ;
నీదు - నెమ్మేను కమిలిపోవుననీ నాకు భీతి ;  ||  
;
పిల్లగాలి తెచ్చినది మల్లె తావిని  ;
నది మలయ సమీరం - చల్లనిది ఉన్నది ; 
ఇది చాలు కదా, అంటేను నవ్వుతావు ;  ||  
;
నీ నవ్వుల ఓలలాడు - నిఖిల విశ్వ తేజములు  ;  
నిను కంటూ - ప్రతి ఒక్కరము ఇపుడు ;
మాత యశోదలమే ఐతిమిలే వేణుధరా ;  || 
;
=
gaali cewulu meli trippi ; 
wENuwulO kuurinaawu ; aahaahaa! 
nee cEshThalu, cilipi caryalu ; ;  || 
;
2] komDagaali EmO adupu lEnidi ;
emDa gaali segalu, pogalu egajimmEnu ;
needu - nemmEnu kamilipOwunanee naaku bheeti ;  || 
;
pillagaali teccinadi malle taawini ;
nadi malaya sameeram - callanidi unnadi ; 
;
idi caalu kadaa, amTEnu nawwutaawu ;
nee nawwula OlalADu - nikhila wiSwa tEjamulu 
ninu kamTU - prati okkaramu ipuDu ; 
maata yaSOdalamE aitimilE wENudharaa ;

No comments:

Post a Comment