Sunday, November 30, 2014

అక్షర ఉపాలంబన

వినోద, విజ్ఞాన, విహ్వలతలను 
విరబూసేటి కల్పలత కదా 
-            మన ఇంటర్ నెట్!
ఈత రానివారిని సైతం, 
గజ ఈతగాళ్ళవలె మలిచేను 
-          ఫేస్ బుక్ నేస్తం!        
నవరసభావ వర్ణనా విచిత్ర వర్ణ మాలికలను
చదువరులకు పంచిఇచ్చేను కంప్యూటర్ లోకం!  
గుదిగుచ్చిన పూవుల ఘుమఘుమ చెండ్లను;
సినీ వార్తల పల్యంకిక ఇది; 
నవ వధూవరులవలె పాఠకులౌదురు!   
బూజం బంతి చెండ్లాటలను తలపించేను;
మేజువాణీ నర్తనశాలలు చక్కని బ్లాగులు;
మూజువాణీల ఓట్ల పేటికలు ట్విట్టర్, లింకులు
లింక్ డెన్ లోగిలి చెమ్మచెక్కలు, పిల్లిమొగ్గలు;
వెబ్ పత్రికల పూలగొడుగులు;
     ఓమ్ నమః శివాయ!            సిద్ధం నమః॥ 
అంటూ, 
బరులను దిద్దిన నాటి బాల్యము
చివురులు వేసెను మునివ్రేళ్ళన్; 
మరచి పోబోతున్న అక్షరమాలను
Type న దిద్దించేను కీబోర్డు, మౌసులు;
ఏకపంక్తిని గురు, శిష్యులకు 
లభించు కమ్మని విందు భోజనము!

సకలశాస్త్రముల లోగిలి ఈ-నెట్!
సర్వభాషల నగిషీఅల్లిక తోరణమ్ములను 
దాల్చిన సింహద్వారము పలుకునెల్లెడల      
"సుస్వాగతము!" - సరిగమ పదనిస 
గమకములొలుకగ, బహు గమ్మత్తుగ!
నిఖిలావనికీ నిండు వేదిక ఇది!

 *****************************,

stars dots designs 












- (గుణింతాల ఒజ్జ - ఇంటర్ నెట్ )
          (- కాదంబరికుసుమాంబ శ్రీ )
{views; 21615;
57533 - konamanini}  - 8:14 AM 11/30/2014

Sunday, November 16, 2014

చెమ్మ చెక్క, చెమ్మ చెక్క

చెమ్మచెక్క, చెమ్మ చెక్క, చెమ్మ చెక్క;;
మబ్బులాడితే; దడదడ ఉరుకు ఉరుములు;
మా ఊరికి వినవచ్చును ఉరుము భజనలు ||

తళతళతళ మెరుపులు;
మెరిసేటి మెరుపుల రాగ తోరణాలు;
మువ్వల మురళిని పట్టిన చిన్నిక్రిష్ణుని;
శిష్యగణములాయేను ఉరుము మెరుపులు  ||

సన్నాయి మేళాలు ; ఉరుముల బాజాలు;
భాజా భజంత్రీలకు కొత్త రాగమాలికలను
అందించి, నేర్పించును వేణునాదమ్ములు
అందున్నవి ప్రకృతీ వేద సౌందర్యాలు ॥

 jigjag designs

By:-  @కాదంబరి కుసుమాంబ
అఖిలవనిత
Pageview chart 28529 pageviews - 740 posts, last published on Nov 5, 2014
Telugu Ratna Malika
Pageview chart 3820 pageviews - 122 posts, last published on Nov 5, 2014
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 54212 pageviews - 1000 posts, last published on Nov 5, 2014 - 

Wednesday, November 5, 2014

తోటలో పసందైన విందులు

నిక్కులేల గౌరమ్మా! టెక్కులేల చంద్రమ్మా! 
పిక్నిక్కు, విహారాల విందు చేద్దాము; 
వనభోజన వేడుకలు భలే భలే పసందులు || 

తులారాశి ప్రభాకరా!
కార్తీకం ఆగమనం!
వనభోజన విందులు; 
భలే పసందులు!   || 

తులారాశిలోన; సమతౌల్యతగాను; 
ఆదిత్యుని రాక; అందమైనది;
కార్తీకము శీతలము; మది మదికీ ఉల్లాసము: 
శోభావహము; శోభనీయము, శోభన  పర్వం|| 

వెలిగించిన దివ్వెలకు; హుందాతనము; 
ఆకాశదీపములై వెలుగులొసగును;  
కార్తీకము శీతలము; మది మదికీ ఉల్లాసము: 
శోభావహము; శోభనీయము, శోభన  పర్వం ||

********************************, 

 Hare krishna! krishna! krishna!