Sunday, September 16, 2018

తమలపాకు చిలక ఉళ్ళుళ్ళళ్ళా ప్రేమకు కొలతలు

ఆకు, వక్క, సున్నం - తమలపాకుల చిలక ; 
పొందికగా చేద్దాము చెమ్మచెక్క ;; 
స్త్రీ  - 1 ;-
పోక చెక్క కొరికి, పంటి బలము చూపు - చెమ్మచెక్క ; 
నాలిక పండిందంటే, ప్రేమాస్పదమైన మానసము కలిగి ఉన్నట్లు ; 
అందుకె - తాంబూలాన్ని నమిలి నోరును చూపు, చూపు క్రిష్ణయ్యా! ;
నీ నాలిక చాపి చూపించు చెమ్మచెక్కల క్రిష్ణయ్యా!
స్త్రీ 2 ;-
అరెరే - అన్ని షరతులు మోహన కృష్ణునికేనా!!? ; 
పణతులు మీరేమో - ఆకుల చిలకల జోలికి పోరు, 
బల్ చమత్కారముల వారు ; 
స్త్రీ  3 ;-
తాంబూల చర్వణమును - మాకు వేరుగ ఎవ్వరు నేర్ప నక్కలెదు - 
కనుమో సఖియా ; ఇదిగో నెమరేస్తున్నాము - లేత నవలాకులను ;
స్త్రీ 4 ;- 
సహజంగానే మోవులు - కెంపుల మించిన ఎరుపులు ; 
భేదం, తేడా లెటుల తెలియును - చాలు చాలమ్మా ; 
చాల్లే పోవమ్మా  ;  || 
;
రేపల్లె వాడలలో భామామణులలోన వేళాకోళాలు ;
మణికంకణముల మెరిసి, నవ్వు సూర్య కిరణాలు ;  
;
========================; ;
;
aaku, wakka, sunnam ; tamalapaakula cilaka ; 
pomdikagaa cEddaamu cemmacekka ;; 
stree  - 1 ;-
pOka cekka koriki ; pamTi balamu cUpu - cemmacekka ; 
naalika pamDimdamTE ; 
prEmaaspadamaina maanasamu kaligi unnaTlu ; 
amduke - taambuulaanni namili nOrunu cuupu, 

cemmacekkala krishNa ;
naalika caapi cuupimcu krishNayyaa!
stree 2 ;-
arerE - anni sharatulu mOhana kRshNunikEnA!!? ; 
paNatulu meerEmO - aakula cilakala jOliki pOru, 
bal camatkaaramula waaru ; 
stree  3 ;-
taambuula carwaNamunu - maaku wEruga ewwaru nErpa nakkara lEdu - 
kanumO sakhiyaa ; idigO nemerEstunnaamu - 
lEta nawalaakulanu ;
stree 4 ;- 
sahajamgaanE mOwulu - kempula mimcina erupulu ; 
BEdam, tEDA leTula teliyunu - caalu caalammaa ; 
caallE pOwammaa  ;  || 
;
rEpalle wADalalO bhaamaamaNulalOna wELAkOLaalu ;
maNikamkaNamula merisi, nawwu suurya kiraNAlu ; 

No comments:

Post a Comment