Thursday, December 19, 2013

ఎంత సేపు ఈ ఎదురుతెన్నులు

ఎంత సేపు ఎంతసేపు ఎంతసేపనీ:
ఎదురు చూస్తు ఉండాలి!?
ఈ తీరుగనే గోపాలక్రిష్ణ! ||ఎంత సేపు ||
;
ఎద నిండా ఆరాటం, ఏవేవో సంశయాలు,
దోబూచులు దొంగాటల మేటివి ఎటులైనావని?
;
నీదు వామ హస్తమున  పాంచ జన్యమున్నది గద!
మా శంకలను తీర్చుమోయి?
శంఖు తీర్ధ ప్రసాదములు భక్త కోటి కందును గద!?||ఎంత సేపు||
;
నిరతము నీ కరము నుండు;
కౌమోదకము స్థితియె మేలు-
మా కన్నను కద! కన్నా! ||ఎంత సేపు ||
;
ఆర్త రక్షకుడవనుచును
నీకు గొప్ప బిరుదములు;
తోచి తోచకుండా; మము వేపుట నీ మరియాదా!?
సరి సరి! ఓ మురారీ! బర్హి పింఛధారీ! ||ఎంత సేపు ||
;
అవతారము లెత్తు విద్య మాకు; కాస్త నేర్పుమోయి!
నీ చెంత నుండు భాగ్యముకై;
విల్లుగానొ, దండగానొ, ఏదో ఒక వస్తువుగా;
నీ ఎడదపైన నుందుమోయి!
మేముందుమోయి! ||ఎంత సేపు||

*****************************;

పాట:- భక్తుల విన్నపములు!!!!!!!

[1. నీదు ఎడమ చేతిలోన/
    వామ హస్తము= ఎడమ చెయ్యి
    దక్షిణ హస్తము= కుడి చేయి ]

  ౩ ౪              ౯      

విజ్ఞానపు పసిడి మేడ!

Krish, Fancy Dress 


 బుడుగు బుడుగు పిల్లలార!
 రండి!రండి! స్కూలుకు
  అమ్మ నాన్న 'చిటి వేళ్ళను పట్టి
  రండి! రండి! బడికి;
             అక్షర గుడికి
             మీరందరు సత్వరమే!     ||

  చెడుగుడు గుడు గుంచం
  ఆటలంత తేలిక!
        అక్షరాలు నేరిస్తే
        ఉంటుందెంతెంతొ మజా!
               అది,విజ్ఞానపు పసిడి మేడ!     ||

                    ''''''''''''''''''''''''''''''''''

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?   (Link: See Essay: kONamaanini )
గురువారం 19 డిసెంబర్ 2013

ఆధార పదాలు:-
KitKat club, an 18th-century literary salon in Christopher Catling's
(hence the "Kit Cat") pie-house
in Shire Lane,