Saturday, September 15, 2018

అటు తానే, ఇటు తానే మహా మేటి కృష్ణుడు

అటు తానే, ఇటు తానే, విశ్వవిభుడు దైవము ;
అటు నుండి ఇటుగా ; ఇటు నుండి అటుగా ; 
దోబూచులాటలందు మహా మేటి కృష్ణుడు :  || 
;
అటువారికి అటుగా ; ఇటు వారికి ఇటుగా ; 
అటు ఇటుగా- మాటలెన్నొ చెప్పుచూ ; 
రాజీలను కుదిరించు రాయబారి తానేను :  ||

& అటుకేసి ఒక చూపు ; ఇటు కేసి ఒక చూపు ; 
యశోదమ్మ, యమునాతటి ; 
నట్ట నడిమి బిందువు :  ||
;
ఇటు అటుగా, అటు ఇటుగా ;
పల్లె, నగరి అనుబంధం ; 
ఏర్పరచగలుగు తుంటరి మేధావి :  ||
;
అటుకు చిటుకు - చిటుకు అటుకు లాటలు ;
విస్తారం ఆటలిటుల ఇచట ; 
పటుతరముగ ఎటులిటుల ;
సంఘటనల పరంపరలు :  || 
;
వ్రేపల్లె నుండి మధుర దాక ; 
బాటలను పరచినట్టి ;
క్రిష్ణ లీల పరిమళాల పూవులు ;
ఇవి ఇటుల మరల మరల ;
మరల మరల ;
గుబాళించు నిరంతరం :  || 
;  
=====================; ;
;
aTu taanE, iTu taanE ; wiSwawibhuDu daiwamu ;
aTu numDi iTugaa ; iTu numDi aTugaa ; 
dObUculaaTalamdu mahaa mETi kRshNuDu :  || 
;
aTuwaariki aTugaa ; iTu waariki iTugaa ; 
aTu iTugaa ; maaTalenno ceppucuu ; 
kudirimcunu raajeelu ;
raajeelanu kudirimcu ; 
raayabaari taanEnu :  || 
;
& aTukEsi oka cuupu ; 
iTu kEsi oka cuupu ;
yaSOdamma, yamunaataTi ; 
naTTa naDimi bimduwu ; 
iTu aTugaa ; aTu iTugaa ;
palle, nagari anubamdham ; 
Erparacagalugu tumTari mEdhaawi :  || 
;
aTuku ciTuku - ciTuku aTuku laaTalu ;
wistaaram aaTaliTula icaTa ;  
paTutaramuga eTuliTula ;
samghaTanala paramparalu :  ||
;
wrEpalle numDi madhura daaka ; 
baaTalanu paracinaTTi 
krishNa leela parimaLAla puuwulu ; 
iwi iTula marala marala ;
marala marala ;
gubaaLimcu niramtaram :  || 

No comments:

Post a Comment