Tuesday, March 7, 2017

మేలైన బాట

చేమంతి, గులాబీ, మల్లిక ; 
వసుధ ఆయె నేడు 
  అందాలకు వేదిక. 

మోదమ్ములకు వసుంధర. 
వేసెను ఆమోద ముద్ర ; 
ప్రసూనముల వికాసములు. 
ప్రకృతి సంతోష ఘంటిక. 

గాలి స్వచ్ఛతకు బాసట. 
చిరుగాలి జీవులకు ఊరట ; 
పరిమళాల మేళాలతొ ;
జగమంతా కళ కళ

శాంతి,సంతోషములకు
తలమానికము తరువులు .
పచ్చ దనములు సదా
విలసిల్ల వలెను “ ఇల”పైన
సకల లోక శ్రేయస్సు బాట – కిదే
ఇదే మంచి మాట ;  
సదా ఇదే మేలు బాట  
&

జాబిల్లి బాల పత్రిక గీతాలు 
 April 6, 2010   2 Comments
రచన : కాదంబరి పిదూరి   చేమంతి, గులాబీ, మల్లిక 

ఇందుబింబ, సినీవాలి

చందమామ, చందమామ! 
ఎల్లరికీ మేనమామ ;

శశిధరుడు , తారాపతి ;
ఇందుబింబము,
ఇంకా ......... 
రాకేందుడు, సినీవాలి .... 
ఇన్ని పేర్లు నీకున్నవి ;    ||  
ఈశుని సిగలోన  
ఇంచక్కా- 
దూరినట్టి మేటివి!; 

ఐనా - 
ఇసుమంత గీర లేని వాడివిలే!! :  
;
రాత్రి అంటే భయం, fear ;
అమావాస్య కారు నలుపు ;
అందరికీ భీతి గొలుపు ;  ||
;
చిమ్మచీకటి ఐనా ; 
చల్లనైన వెన్నెలను ; 
వరముగా ఇస్తావు ;  ||                                                                              ;
కటిక చీకటి పైన ; 
అలుక పూనవు నీవు ;
నిశి రేయికి శీతలమౌ
జ్యోత్స్నలను ఒసగుతావు;  || 

=====================;

కవిత - 4 
camdamaama, camdamaama! 
ellarikee mEnamaama ;

SaSidharuDu , taaraapati ;
indubimbami,
inkaa ... rakendudu, sineewaali ;
inni perlu neekunnawi ;  ||
;
ISuni sigalO imcakkaa
duurinaTTi mETiwi!;
ainaa isumamta geera lEni wADiwi! :  ||

raatri amTE Bayam, #fear #;
amaawaasya kaaru nalupu ;
amdarikii bheeti golupu ;  ||
cimmaceekaTi ainaa ; 
callanaina wennelanu ; 
waramugaa istaawu ;  ||

kaTika ceekaTi paina ; 
aluka puunawu neewu ;
niSi rEyiki SItalamau

jyOtsnalanu osagutaawu;  || 
;
 జాబిల్లి బాల పత్రిక గీతాలు ;-  
పిల్లల పాటలు - writers ; LINK ;-

జాబిల్లి భరోసా

నెలవంకా! నీ వెన్నెల నవ్వులను ;
భరోసాగ ఇస్తూనే ఉన్నావు ; 
అందుకే జాబిల్లీ!
ఎల్లపుడూ నీకు మా ఎనలేని ప్రశంసలు ;
ఆబాలగోపాలం కీర్తించును నిను సదా!
చల్లనీ వేళలకు నీవేగా భరోసా ;  ||
;
-  కవిత - 3 
====================;

kawita - 3 ;-

nelawamkaa! nee wennela nawwulanu ;
bharOsaaga istuunE unnaawu ; 
amdukE jaabillI!
ellapuDU neeku maa enalEni praSamsalu ;
aabaalagOpaalam keertimcunu ninu sadA!
callanee wELalaku neewEgaa bharOsaa ;  ||

*********************;
బతుకమ్మ దీవెనలు ;-  
     actober 29, 2010   3 Comments ;- రచన; Anil Piduri 
ఇంతులూ, పిల్లలూ, ముద్దరాళ్ళు బంగారు కలశాల – 
భమిడి పళ్ళాలలో బతుకమ్మ పూ మేడలను కట్టి తెచ్చేరు 
దసరాకు సంబరం పిలుపు పేరంటం
;
మేలైన బాట ;-  April 6, 2010   2 Comments ;- 
రచన : కాదంబరి పిదూరి ;-
చేమంతి, గులాబీ, మల్లిక 
వసుధ ఆయె నేడు 
అందాలకు వేదిక 
మోదమ్ములకు వసుంధర 
వేసెను ఆమోద ముద్ర;
&
Labels: జాబిల్లి, బాల కవితా గీతములు, మా రచనల పట్టిక ;-
 జాబిల్లి బాల పత్రిక గీతాలు ;-  

రత్నమణి crescent

పున్నమి జాబిల్లీ! 
పదహారు కళలతోటి ;
నీ తీరు, ఆశ్చర్య సంభ్రమమే!  ||
నటరాజు సిగపాయల ;
మెరయు రత్న మణివి నీవు ;  ||
నెలవంక దివ్వెవై ; 
బహు ముచ్చట గొలుపుతావు ;  ||

========================; 
కవిత -  2
punnami jaabillii! 
padahaaru kaLalatOTi ;
nee teeru, aaScarya sambhramamE!  ||
naTaraaju sigapaayala ;
merayu / rustuunna ratna maNiwi neewu ;  ||
nelawamka diwwewai ; 
bahu muccaTa goluputaawu ;  ||
;
************************************:
]] చిటికెల పందిరి
 September 25, 2009 ;- రచన ; కుసుమ కుమారి 
చిటి చిటి జాబిలి చిటికెలు వేసెను 
చుక్కలు వచ్చి,నింగిని చేరెను 
నీలాంబరము తారల కొలువయె! 
జాబిలి వెన్నెల చప్పట్లు చరిచెను నక్షత్రాలు
&
]] బుర్రు బురు పిట్ట
 September 12, 2009  ; రచన: అనిల్ కుమార్ పిదురి ;
బుర్రు బురు పిట్ట తుర్రు తుర్రు పిట్ట ;
“నీ-ముక్కు సొత్త”అంటే గుర్రు గుర్రు కోపం. 
చర్రు చరున వ్రాలి గింజ,విత్తులేరి రివ్వు ;
] జారు! జారు!జల పాతాలు !
 September 13, 2009   4 Comments
రచన;కాదంబరి జారు! జారు!జల పాతాలు ! 
ఎత్తిపోతల జల పాతాలు : 
వంశ ధార నది, పంచ ధారల, 
కుంతల వాటర్ ఫాల్సు, ఓహో! 
జారే జారే జల పాతాలలొ
;
చిటికెల పందిరి : LINK ;- లింక్ :-
జాబిల్లి బాల పత్రిక గీతాలు ;- 2, 3 ;
;

కమ్మ కమ్మని విందు

చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది
సితా కోక చిలకమ్మ రుస రుసలు
కస్సు బుస్సు మంటోంది గొరవంక
విస విసా వచ్చింది వన మయూరం

నేస్తాల చిట పటలు మాన్పి వేయంగా
యోచనలు చేసాయి గబ్బిలాయి, గుడ్ల గూబ;

“ అడవిలోని దోస్తులను అన్నిటినీ
విందుకు రమ్మని” పిలిచాయి.

“వివాహ భోజనంబు – వింతైన వంటకంబు “
ప్రిపరేషనులలోన తలమునకలు అయ్యాయి.

ఇది చూస్తూ గుర్రు గుర్రు మన్నది గుంట నక్క ,
అది బహు జిత్తుల మారి.
గుట్టు చప్పుడవకుండా 
నక్కి నక్కి వచ్చింది నక్కమ్మ,
అంతేనా!?
గుప్పెడు ఉప్పు క్షీరంలో 
గభాలున గుమ్మరించి
ఉప్పు చప్పుడవకుండా 
జారుకుంది చల్లగా!

పాలు కాస్త విరిగిపోయె!
చెవుల పిల్లి కుందేలు
“బెంబేలు పడకండ”న్నది;
క్షీరాన్ని వడ కట్టింది,
ఉడుత సాయమవ్వగా
పన్నీరు, రసగుల్లాలను
చిటికెలోన రెడీ ఆయె !
వన భోజనమ్ములొహో!
వన జంతు, పక్షి, కీటకమ్ములు
ఖుషి ఖుషిగా కానుకలిచ్చి
షడ్రుచుల విందు నారగించి
“బ్రేవ్!”మంటూ త్రేన్‌చాయి;

గుడ్ల గూబ, గబ్బిలములు
అందుకొనెను అందరి మన్ననలు, అభినందనలు.
$$$$$$$$$$$$$$$$$$$$$$;

ద్రావిడ భాషా వర్గానికి చెందినది “ఆంధ్ర భాష”. 
శబ్దాలను, సవ్వడులను రెండు సార్లు ( ద్విరుక్తి ) పలకడము 
తెలుగు మాటలకు ఒక అందము చేకూరుతున్నది.
గుస గుసలాడుట, కిల కిలా నవ్వుట, 
మిస మిస కాంతులు ……. 
ఇలాంటివి అన్న మాట.
బాల బాలికలారా! 
ఇలాంటి మరిన్ని సరదా సరదా పదాలను – 
సరదాగా ప్రయత్నించి సాధించండి , చూద్దాం!!!!!!
  
( writer : P. kadambari ) ;

*******************************************:

]] కమ్మ కమ్మని విందు ;-  March 27, 2010   
రచన : కాందబరి పిదూరి ;-
చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది 
సితా కోక చిలకమ్మ రుస రుసలు 
కస్సు బుస్సు మంటోంది 
గొరవంక విస విసా వచ్చింది
]] పండు లాంటి పండుగ దీపావళి ;-   March 11, 2010   ;-
రచన : అనిల్ కుమార్ పిదూరి 
దివ్య దివ్య దీపావళి 
ప్రతి సారీ ఈ పండుగ “హుషార్ పండు” నవ్యమే! 
నవ నవీన పర్వమే! || – 
]] పక్షుల పలుకులు ;-           October 12, 2009 ;- 
“మాటలు అంటే   
మానవులకు మాత్రమె సొంతం”అంటే ఎట్లాగ? 
మైనా పిట్టల ఈల 
పాటలను, రామ చిలుకల ;
[ మా రచనల పట్టిక, జాబిల్లి, బాల కవితా గీతములు, గీత రూపకము ] 
&
jabilli 













జాబిల్లి బాల పత్రిక గీతాలు - 1 

మబ్బు దుబ్బు జుట్టు

చిట్టి చిట్టి నెలవంక ; 
మబ్బు దుబ్బు జుట్టు తోటి ;
చిరాకుగా ఉన్నది, 
పరాకుగా ఉన్నాది ;  ||
;
కొబ్బరాకు కంఘీని 
   తెచ్చి ఇచ్చె వనదేవి ;
దువ్వుదాము మొయిలు జుత్తు ;   || 

దువ్వెనతో దువ్వుదాము 
   మొయిలు జుత్తు ;  
దిద్దుదాము తీరుగాను ; 
  తీర్చి దిద్దుదాము తీరుగాను ;;  ||
చీకాకు పోగానే 
   పలకరించె నెలవంక ;
చిమ్మ చీకటికి కూడా 
       తాను నేస్తమైనాది ;  || 

నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మేదినిని;
వెన్నెల - నవ్వులను చిందిస్తూ, 
   వంగి చూసె మానవులను; ;  ||

====================;

ciTTi ciTTi nelawamka ; 
mabbu dubbu juTTu tOTi ;
ciraakuagaa unnadi, 
paraakugaa unnaadi ;  ||

kobbaraaku kamghiini 
tecci icce wanadEwi ;
duwwudaamu moyilu juttu ; 
duwwenatO duwwudaamu moyilu juttu ;  || 

diddudaamu teerugaanu ; 
teerci diddudaamu teerugaanu ;;  ||

ceekaaku pOgaanE 
palakarimce nelawamka ;
cimma ceekaTiki kUDA 
taanu nEstamainaadi ;  || 
;
nawwulanu cimdistuu, 
wamgi cuuse mEdinini;
wennela - nawwulanu cimdistuu, 
wamgi cuuse maanawulanu; ;  ||

& [ మా రచనల పట్టిక, జాబిల్లి, 
        బాల కవితా గీతములు, గీత రూపకము,  ] 
మబ్బు దుబ్బు జుట్టు ;
Jabilli , many [ LINK ]