Wednesday, September 12, 2018

పదే పదే నీ ధ్యానమె చేసేను రాధిక

పదే పదే నీ ధ్యానమె చేసేను రాధిక ;
మరల మరల - పొరపాటిది  - 
అనుకుంటూనే మానదు .......... ;
;  
'పోదూ, ఇది పొరపాటు' - 
అనుకున్నా మానలేదు ;
పొరపొచ్చము లెన్నెన్నో, 
అలవాటుగ ఐనవి ;  ||
;
కన్న చేతి వాటం మహిమేమో గాని ; 
లిప్త కాలమందుననే - 
తన తుంటరి, అల్లరి చేతలన్ని మరతురు ; 
ఇది ఎట్లా సాధ్యం!?;  || 
;
అలవాటు, పొరపాటు, గ్రహపాటు, 
ఏది ఏమైన గాని ; 
సకల సమస్యలనూ బాపేటి ఔషధం ; 
కృష్ణ సాన్నిధ్యం, ఇది తథ్యం ;
ఇది స్ఫటికం, ఇది సత్యం ;  || 
;
=====================; ;
;
padE padE nee dhyaaname cEsEnu rAdhika ;
marala marala - porapATidi  - 
anukunTUnE maanadu .......... ;
;
'pOduu, idi porapATu ' - 
anukunnaa maanalEdu ;
porapoccamu lennennO, 
alawaaTuga ainawi ;  ||
;
kanna cEti waaTam mahimEmO gaani ; 
lipta kaalamamdunanE  ; 
tana tumTari, 
allari cEtalanni maraturu ; 
idi eTlaa saadhyam!?;  ||

alawATu, porapATu, grahapATu, 
Edi Emaina gaani ; 
sakala samasyalanuu baapETi aushadham ; 
kRshNa saannidhyam, idi tathyam ;
idi sphaTikam, idi satyam ;  || 
;

No comments:

Post a Comment