Monday, March 26, 2012

బావి ఎదుట స్త్రీ బొమ్మ















ప్రాచీనత- అనేది, ప్రపంచములోని అన్ని దేశాల నాగరికతా వికాసమునకు తీపి గుర్తులు.
అందుకే ప్రపంచ దేశాలలోని ప్రజలు
తమ తమ ప్రాచీన జ్ఞాపకాలను పదిలపరుచుకోవడములో ఉత్సాహాన్ని కలిగిఉంటారు.
ఆ అంశాలు, చరిత్ర, భాష, ఆదర్శమూర్తులైన వ్యక్తులు,
సంగీత సాహిత్య శిల్ప చిత్రలేఖనాది కళలు, వివిధ వస్తువుల గురించీ .....
ఏదైనా కావొచ్చును.
గోవాలో ఒక బావి వద్ద మహిళ బొమ్మ కూర్చుని ఉన్న విచిత్ర దృశ్యం ఉన్నది.
ఒక స్త్రీ మూర్తి బొమ్మ, బావి ఎదుట ఉన్నది.
నీలం చీర, ఎర్ర జాకెట్టు ధరించిన ఆ వనిత- ఒక ప్లాట ఫారం పైన ఆసీన ఐ ఉన్నది.
బావి- యొక ప్రాచీనతకు- విశదీకరించే పద్ధతిలో ఈ శిల్పాన్ని - అక్కడ ఉంచి ఉంటారు.
నా ఊహ నిజమైతే- ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధానాన్న్ని
 అనుసరించాల్సిన ఆవశ్యకత ఉన్నది.
మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సత్రాలూ, మంచినీటి బావులూ- కనుమరుగై పోతున్నవి.
(ఈనాడు హోటళ్ళు అనేక రెస్టరెంట్లు -
ఈ లోటుని భర్తీ చేస్తునాయి అనుకోండి, ఫర్వాలేదు)  
మనకి సంఘానికి మేలు కలిగించే- త్రాగు నీటి వనరులు, భోజన సదుపాయాలను
యాత్రికులకు సమకూర్చే ధర్మ సత్రాలు వంటి వాటికి,
వాని ప్రాచీనతకు ప్రతీకలుగా- ఇలాగ శిల్పాలు వగైరాలను-
నిలిపి ఉంచడం మేలు కదా!
అఫ్కోర్స్! చెరువులు, నదులకూ సైతం ముప్పు వాటిల్లుతూన్న
నేటి నేపథ్యంలో వాపీ. కూప, తటాకము భద్రతలకై
మన ఘోష, గోల, గగ్గోలు అనవసరమని- అంటున్నారా?
హ్హూ.....! అదీ నిజమేనేమో!
ఐతే గంగా నదీ పరిరక్షణా కార్యక్రమాలకు- కొంచెం కొంచెం కదలికలు-
మన ప్రజా ప్రభుత్వం వారిలో ఏర్పడుతున్నవి కదా!
ఈ మాత్రం ఆశావహ దృక్పథం పొరబాటు కాదు కదా!
**************
రావల్ నాథ్/ భూత నాథ్
(Vetoba | Ravalnath | Bhootnath) కోవెల సీమలో వద్ద  ఉన్నది ఈ బావి.

Friday, March 16, 2012

వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము











విష్ణువర్ధనుని భార్య అఖిలాండేశ్వరీ దేవి.
వారి కుమార్తె హరిత, కుమారుడు గ్రీష్మ దేవ్.
విదేహ రాజ్యానికి నదీశ్వర్ ఏలిక.
“మా పుత్రిక స్వయం వరము జరుగుతుంది.
కాబట్టి మీరెల్లరూ ఈ సంరంభములో పాల్గొనవలసినదిగా  కోరుచున్నాము“
విష్ణువర్ధనుని కుటుంబీకులు -
వారి బంధువుల పాలనలో ఉన్న విదేహ రాజ్యానికి వెళ్ళారు.
నదీశ్వరుని కుమార్తె అంతకు మునుపే,
రోహణుని ప్రేమించింది,
కాబట్టి ఆమె అక్కడ స్వయంవరములో
రోహణుని మెడలో వరమాల వేసినది,
వారిరువురికీ పరిణయం కుదిరింది.

**************************************

అందరూ తమ తమ రాజ్యాలకు మరలి వెళ్ళసాగారు.
అఖిలాండేశ్వరి, తనయ, తనూజుడు కూడా గుఱ్ఱపు బగ్గీలో ఎక్కించి,
నదీశ్వర్ దంపతులు సాదరంగా అతిథులుగా వచ్చిన వారికీ,
అక్కడ స్వయంవరములో పాల్గొన్న వారికి, అందరికీ  వీడ్కోలు పలికారు.
గ్రీష్మ దేవ్ తన రాజ్యానికి మరలిపోయాడు.
స్వదేశానికి వచ్చిన గ్రీష్మ దేవ్
అశాంతితో విర విరలాడసాగాడు.
“విదేహ రాజపుత్రిక తనను వరించలేద”ని
అవమానంతో కుతకుతలాడసాగాడు………………..
.
గుర్రబ్బగ్గీలలోనికి ఎక్కేటప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది.
హరిత జడపాయలలోనికి మూడు సీతాకోకచిలుకలు వాలినాయి.
రాకుమార్తె బండిలోకి ఎక్కిన తర్వాత,
సారధి, తలుపులను మూసి,
ఛెర్నాకోలతో అశ్వములను అదిలిస్తూ ముందుకు సాగాడు.
తమ రాజ్యాన్ని చేరిన పిమ్మట
“చిన్నమ్మా! మీ సిగలో ఏవో కొత్త రకం పూలు ఉన్నాయి”
వాటిని వింతగా చూస్తూ, అడిగారు ఆమె చెలికత్తెలు.
తీరా చూస్తే అవి కీటకాలు!!!!!!
‘అవి ఏమిటో?’  వారెవ్వరికీ అర్ధం కాలేదు.
ఎందుకంటే ఆ దేశములో భ్రమరాలు, సీతాకోకలూ
అసలు  లేనే లేవు.
వారినీ వీరినీ “వాటిని ఏమని పిలుస్తారు?” అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.
అచ్చోటికి ఒక తాపసి వచ్చాడు.
దేశ సంచారి ఐన “నయన స్వామి”ని
రాజకుమారి,తదితరులు
“ఇవి ఏమిటి స్వామీ!” అని అడిగారు.
వాటిని గమనించి, ముని
“అవి భ్రమరములు. వానిని సీతాకోక చిలుకలు- అని పిలుస్తారు”
అంటూ వారి సందేహ నివృత్తి చేసాడు.
అప్పటినుండీ యువరాణి హరిత
ఆ సీతాకోక (butterflies) ని జాగ్రత్తగా చూసుకోసాగింది.
ఐనప్పటికీ అవి, చిక్కిపోతున్నాయి.
శుష్కించిపోతూన్న ఆ బటర్ ఫ్లై లను చూసి,
హరిత దిగులుపడసాగింది.
ఆమెతో ఆ రంగుల సీతాకోకలు చెప్పాయి ఇలాగ,
“ఓ రాజకుమారీ! మీ రాజ్యంలో చెట్లు, తోటలు, మొక్కలూ లేవు.
మేము పచ్చని మొక్కలు, తరువులు,
పూల తోటి మేము సావాసం చేస్తూంటాము.
పుష్పాలూ, పూల పుప్పొడులే మా అతిథి గృహాలు.
ఇచ్చట పచ్చదనము కరువైనట్లుగా ఉన్నది గదా!
మాకు బాగా ఉక్క పోస్తూన్నది. ఉష్ణముగా కుడా ఉన్నది,
ఇలాగ ఎందుకని ఔతూన్నది?”
అప్పటికి వారికి బోధపడింది
‘విష్ణువర్ధన చక్రవర్తి తన సామ్రాజ్యాన్ని దిగంతాల మేరకు
విస్తరించాలని ఆకాంక్షించాడు.
ఇతర రాజ్యాల పైకి దండెత్తి, అశ్వమేధ యాగము చేసి, జైత్ర యాత్రలతో
కొంతవఱకూ తన కోరికను సాధించాడు కూడా!
తన లక్ష్య సాధనకై, ఆతడు ఇంకా ఇంకా సైనిక బలాగాలను,
ఆయుధాలనూ ఇబ్బడిముబ్బడిగా పెంపొందించసాగాడు,
ఇలాగ తయారుచేసే కర్మాగారాలతో రాజ్యం అంతా నిండింది.
ఆయుధ సంపదను వృద్ధి చేసే యావలో,
తన సీమలో సేద్య, విద్యా, విజ్ఞాన సంపత్తిని నిర్లక్ష్యం చేసాడు.
ఫలితంగా దేశంలో నిరక్షరాస్యత, అజ్ఞానమూ తాండవించసాగాయి.
వ్యవసాయం కుంటువడి, కరువు కాటకాలు మీద విరుచుకుపడడంతో
దొంగతనాలు, కుత్సితత్వాలు పెచ్చుమీరినాయి.
ప్రజలు నిత్యావసరాలైన కూడు, గుడ్డ, నీరు కోసంకూడా కొట్లాడుకోసాగారు.
దేశమంతటా చెలరేగినట్టి అంతర్గత కుమ్ములాటలు -
శాంతి సౌభాగ్యాలకు చేటు తెచ్చాయి ‘
సీతాకోక చిలుకలు తమ సీమలో లేని కొత్త కీటకములు.
వాటి అందచందాలకు అందరూ ముగ్ధులైనారు.
అందుచేత రాజకుమారి హరితయే గాక,
యావన్మందీ, ఆ సీతాకోక చిలుకల కోసము
ఉద్యానవనములను పెంచసాగారు.
తద్వారా తేనెటీగలు వృద్ధి చెందాయి.
దానివలన తేనె వ్యాపారముద్వారా ప్రజలకు జీవనోపాధి కలిగించింది.
అలాగే – ఎప్పుడైతే, చెట్లు, లతలు కళకళలాడసాగాయో-
అప్పటినుంచీ- వాతావరణం ప్రఫుల్లమైనది.
గాలిలో చల్లదనం చోటు చేసుకొన్నది.
అప్పటిదాకా తగ్గు ముఖం పట్టిన వర్షాలు బాగా కురవసాగాయి.
వానలు కురవడంతో
రైతులకు ఉత్సాహం, ఉల్లాసం కలిగాయి.
కర్షకలోకంలో కొత్త హుషారు, ఆనందాలు వెల్లివిరియసాగాయి.
రాజకుమారుడు గ్రీష్మ దేవ్ లో కూడా నెమ్మ నెమ్మదిగా మార్పు వచ్చింది.
నిన్నటిదాకా “యుద్ధము, దండయాత్రలు చేయడము”  అనే
ఆలోచనలు తప వేరేమీ ఎరుగని అతను,
క్రమంగా శాంతి నెలకొంటూన్న జన సంఘములనూ,
శాంతి విప్పారుతున్న దేశమునూ తిలకించగలిగాడు.
“నేటి దాకా మనము సైనికావసరములకు మాత్రమే
కోశాగార ధనమును పూర్తిగా వినియోగిస్తున్నాము.
కానీ ఇకనుండీ, అధిక ధన సంపదలను
ప్రజా శ్రేయస్సుకై వెచ్చిద్దాము”!!! “అని
తన దృఢ సంకల్పాన్ని ఎలుగెత్తి చెప్పాడు.
ఆ పలుకులను వినగానే
సామ్రాట్టు చెల్లెలు, రాజు, రాణి, బంధువులే కాక,
సకల ప్రజానీకమూ హర్షధ్వానాలు చేసింది.
“జేజేలు! జేజేలు” అన్నాయి
వివిధ వర్ణాలతో శోభిల్లుతూన్న సీతాకోక చిలుకలు.

                           (రచన; కాదంబరి)

***************************************


వన్నెల సీతాకోకచిలకలకు ఆహ్వానము (forkids)
Published On Friday, February 10, 2012 By ADMIN.
Under: కథలు, పురాణ కథలు.  

రచన  : కాదంబరి పిడూరి ;
;

Saturday, March 10, 2012

12ఏళ్ళకు పూసే కురంజీలు


కురంజి, నీలకురింజి - అనే పువ్వుకు ప్రత్యేకత ఉన్నది.
నీలగిరి కొండలకి  (strobilanthes kunthiana)
ఈ పుష్ప సౌందర్యాలు ప్రకృతికి చెప్పలేనన్ని సోయగాల వరాలను అనుగ్రహిస్తూన్నవి.
పశ్చిమ కనుమల కోనల, లోయలలో, గుట్టలలో-
షోలా పచ్చిక బయళ్ళు   కురింజి సుమ వన ధామములై,
టూరిస్టులకు నయనానందాన్ని కలిగిస్తూన్నవి.
దక్షిణాదిని చోలా గ్రాస్ లాండులు విస్తారంగా ఉన్నవి.
కురంజి పూల చెట్లు నీలగిరులను శోభాయమానంగా చేస్తూన్నవి.
సతత హరిత అరణ్యాలలో పూసే కురంజీలు
12 సంవత్సరాలకు- అంటే- పుష్కర కాలము అన్న మాట!  
12 years ఒకమారు మాత్రమే పూస్తూంటాయి

Neelakurinji (Strobilanthes kunthiana) purplish blue flowers of Neelakurinji that blossoms gregariously,. వీటిని స్థానికులు పవిత్ర స్థానమును ఇచ్చి, గౌరవిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వాలు నీల కురంజీ పొదరిళ్ళ వన సీమలను సంరక్షిస్తూ, ప్రత్యేక శ్రద్ధతో రక్షిస్తూ పెంచుతూన్నవి.

నీలగిరి కొండలలో Paliyan అనే
కొండజాతి జనులు నివసిస్తున్నారు.
తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలోని ఈ పాళియన్ తెగ ప్రజలు
"తమ వయసును గురించి చెప్పేటప్పుడు-
కురింజీ పూలు పూచే టైమును- లింకుగా ఉపయోగిస్తారు.
ప్రజాతులలో- ఇండియాలో కనీసం 40 జాతులు ఉన్నవి.
 కొన్ని 16 ఏళ్ళకు పుష్పిస్తూంటాయి.

డజను ఏళ్ళకు ఒకసారి కురంజీ సుమ వల్లరి
[shola grass lands; kuraMji, nIlakuriMji -]

3వేల ఏళ్ళకు పూసే పూలు


ఉదుంబర పుష్పము- బౌద్ధ పుష్పము ఇది.
లూషాన్ పర్వతశ్రేణులలో ఒక స్త్రీ నివసిస్తూన్నది.
చైనాలోని జియాంగ్ జీ ప్రావిన్స్
(Lushan Mountain, Jiangxi province) లో
ఈ సీమ ఉన్నది
చైనాలో- ఆ  నన్- ఇంటిలో వాషింగ్ మిషన్ కింద- ఒక కొమ్మ అగుపడింది.
"బార్లీ కాబోలు!" అని అనుకున్నది.
మర్నాటికి ఆ మొక్క ముత్యాల వలె పూలతో ఉన్నది.
అప్పుడు అందరూ దానిని గుర్తించారు- అది అద్భుతమైన దేవతా మొక్క.
3వేల సంవత్సరములకు మాత్రమే పుష్పించే ఆశ్చర్యకరమైన ప్రకృతి వింత.
సంస్కృతభాషలో"ఉదుంబర పుష్పములు"-
స్థానికులు  ఈ పూవులను "Youtan Poluo flower s" అని పిలుస్తారు.
యూటాన్ పోల్వూ- అనే ఈ చీనీ సుమము నిజంగానే ఒక మిరకల్ కదూ!
 Tags :-
"Youtan Poluo flower "/ Udumbara
Buddhist flower, blossoms every 3000 years,
lacewing egg theory