Wednesday, September 12, 2018

వంశీ - ముందు జన్మ స్వర్ణపేటిక

పుణ్యమెంత దాచుకొనెనో ; చిరు వంశీ 
తన - పుణ్యమెంత దాచుకొనెనో ఏమో : || 

క్రిష్ణా నీ పల్లవాళుల స్పర్శ ; 
అందుకొన్నది చిరు వెదురు ; 
మును జన్మ పసిడి పేటికలో - 
పుణ్యమెంత దాచుకొనెనో ; చిరు వంశీ 
తన - పుణ్యమెంత దాచుకొనెనో ఏమో : || 

నీదు బుల్లి పెదవులను తాకగనే - 
నిలువెల్లా తన్మయము ;
రత్నఖచిత సింహాసనమే పొందినది ; 
తిన్నగా చిరు వెదురు ; 
నీదు అధర సింహాసనమెక్కినది ; 
;
|| పుణ్యమెంత దాచుకొనెనో ; చిరు వంశీ 
తన - పుణ్యమెంత దాచుకొనెనో ఏమో : ||
;

No comments:

Post a Comment