Wednesday, May 6, 2009

"కాలము"నకు వర్తమానము పంపించేసాయి


'''''''''''''''''''


 

"నిన్న"ల దృశ్యాల పూలన్నిటినీ దులిపి వేసి 
పుటలను త్రిప్పి, 
"నేడు"ల శ్వేత పత్రాలపైన  
కొంగ్రొత్త చిత్రాలను చిత్రిద్దాం! 

రేపులన్నీ, 
తాము "వర్తమానములు"గా 
మారి పోబోతున్నామని అంటూ 
"కాలము"నకు 
అపుడే వర్తమానానిnniపంపించేసాయి  

కాలము గొప్ప సృజన శీలి! 
తాను సృష్టించే సంఘటనల 
వన్నె వన్నె పూవులతో 

"చరిత్ర"కు సొగసైన జడలను  
నిరంతరమూ అల్లగల నేర్పరి,నిపుణ శిలి!  
మూర్తీభవించిన ఆ అల్లికల సౌందర్యాలను 
మేలిమి పరదాల చాటు నుండి 
చిరు నవ్వులు చిందిస్తూ 
"భవిష్యత్తు" 
సుతారముగా 
అడుగులు వేస్తూ వస్తూన్నది.  

ఆ "నడకలు" 
మనోజ్ఞమైన నర్తనములు కావాలి. 
అవి, 
వర్తమానపు మనోరంజన లాస్య 
నాట్య భంగిమలకు విలాసములు
(=అడ్రసులు) కావాలి. 

నవ్య కాల చిత్ర రచనలను 
"చరిత్ర" 
తన మెత్తటి పొత్తిళ్ళలోన  
మమతానురాగమ్ముల హత్తుకోవాలి!  


''''''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment