Friday, May 15, 2009

మనసే గుడిగా మారినవేళ!Kovela

మనసే గుడిగా మారినవేళ!

By kadambari piduri


(పల్లవి )
నిలకడగా ఉంటే
ఇది "మది" ఔతుందా!
నెమ్మది ఎరుకకు వస్తే
గుడి ఔతుందా?!
స్వామి గుడి ఔతుందా?


ఉల్లసిల్లు మానసమే

సరోవరమాయెను

ఎల్ల వేళలందు; అందు

హంసము తిరుగాడును

భక్తి హంసము తిరుగాడును ||నిలకడగా ఉంటే||

తిరుమలేశు కారుణ్యము
ఎల్లలేమి ఎరుగనిది!
ఎల్లెడలా, ఎల్ల వేళలందున
వెదజల్లెడు కౌముది!
పరిమళాల కౌముది! ||నిలకడగా ఉంటే||
Views (116)'''''''''''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment