Friday, May 8, 2009

పొందిక కుదిరిన చోట


'''''''
పొందిక కుదిరిన చోట ;;;;;; 
'''''''''''''''  
ఏ నేత్రాలకు 
"దృక్కులు" ;
దిశాంతాలకు కదలికలను నేర్పిస్తాయో ; 
ఆ నయనాలను ఆరాధిస్తాను నేను.

ఏ పాదాలకు  
కాంతి నిర్ఝరీ గమ్యాలకు తీసుకు వెళ్ళే ; 
మలుపులు తెలుసునో ; 
ఆ చరణాలకు సాష్టాంగ పడతాను నేను. 

ఏ హస్తాలు 
ఆప్యాయతలను ఆహ్వానిస్తాయో; 
ఆ చేతులను 
మనసారా కన్నులకు అద్దు కుంటాను; 

ఏ మాటలకూ,చేతలకూ 
హృదయంలో పొందికగా 
"వారధి"ని కడతారో 
ఆ మానస సరోవర కెరటాల 
హృద్యంగమ గమకములలో; 
మనసారా స్థిర నివాసమేర్పరచుకుంటాను నేను!  


''''

No comments:

Post a Comment