Friday, May 15, 2009

ధ్యాన మాధురి

Kovela

ధ్యాన మాధురి

By kadambari piduri

శ్రీకృష్ణ గీతములు 4

భువన మనోహర! సుందర శ్యామా!
నిను గని,మరుడే మై మరచేరా! //భువన//

యమునా తీర సైకత వేదిక
లెగసెనురా!,నీ తలపు పవనముల
జిలిబిలిగా ఎగసెనురా!
అల్లి బిల్లిగా విరిసెనురా! //

బృందా వనమున 'రా చిలుకల'
ఎల పలుకులు,నీ ధ్యానమలోన
మధుర మాయెరా!-
సుధా మధుర మాయెరా! //

గోకులమున,వ్రేపల్లియలోన
హరిణ లోచనల చూపు డోలలలొ
సతతము,నిరతము
ఊగు చుండునది నీ రూపేరా! //
Views (69)

No comments:

Post a Comment