Showing posts with label భావనలు. Show all posts
Showing posts with label భావనలు. Show all posts

Sunday, February 10, 2013

రాధ దోసిట నెమలీక


అలికిడి ఎవ్వరి అడుగులవీ?
ఆ అలికిడి ఎవ్వరి అడుగులవీ? ||అలికిడి||
;
కొలనున అలలుగ -
మెత్తగ సాగుతు;
తన పొలకువ ఇదనీ -
చెప్పక చెప్పే ఆ    ||అలికిడి||
;
పిడికిలి ముడిచీ -
గుట్టుగ ఏదో దాచెను రాధిక
గడుసుగ గట్టిగ - తన గుప్పిటినీ -
ముడిచినంతనే దాగేనా, చాలించు ||అలికిడి||
;
విడిలించిన తన పల్లవాంగుళుల -
ఉన్నది గుట్టుగ, ఏమిటో అది?
ఔరా! చక్కని నెమలీక అది!

ఇతర చెలులు :-

ఔను! ఔనే! ఔనౌను సుమా!
మిడి మెరుపులతో
బర్హి పింఛమది ఓ సఖియా!  ||అలికిడి||


కోరస్:-

తెలిసినదమ్మా రాధమ్మా!
బాలక్రిష్ణునికె కానుకలిచ్చే
భలే భలే బులబాటమది!
మదిని మోదములు నింపే;
చక్కని బులబాటమది!

ఇలలో ఇలాటి లావణ్యం - భళిరే!
నీకే సొంతం ఆ సాంతం;
రాధమ్మా! ఓ రాధమ్మా! ||

*******************;
;

;
[ఇంతటి సొగసులు :
రాధ దోసిట నెమలీక;  ]















;
అఖిలవనిత
 19953 పేజీవీక్షణలు - 694 పోస్ట్‌లు, చివరగా Feb 8, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం (00050585)
 37186 పేజీవీక్షణలు - 963 పోస్ట్‌లు, చివరగా Feb 7, 2013న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 2268 పేజీవీక్షణలు - 111 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2012న ప్రచురించబడింది

Saturday, August 27, 2011

గడుసరి వయ్యారము


రాధే క్రిష్ణ














సయ్యాటలాడుచున్నది రాధిక;
వయ్యారము గడుసరిది!
తోయజాక్షి సొగసులలో
హొయలుగ తను మారినది  ||

తన కదలికల పర్ణకుటిని;
ఓహోహో! వయారమా!
ఎపుడు చేరినావు నీవు,
నెయ్యాలతొ అనుమతిని
ఏ తంత్రముతో గొంటివి?
||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||

కానీలను, వరహాలను;  
రాధమ్మకు ఇచ్చినావు?    
"కాని మాటలేల?" అనుచు
కోపగించుకొందువేల- నాపైన

||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||


తన నవ్వుల కడ చేరి    
మువ్వ గీతమైనావు!;      
కను చూపుల గద్దెలెక్కి,    
బాగ తిష్ఠ వేసినావు!
||వయ్యారము గడుసరిది!
  హొయలుగ తను మారినది ||

&&&&&&&&&&&&&&&&
 
        vayyaaramu gaDusaridi! 

sayyaaTalADuchunnadi raadhika;
vayyaaramu gaDusaridi!
tOyajaakshi sogasulalO
hoyaluga tanu maarinadi  ||

tana kadalikala parNakuTini;
OhOhO! vayaaramaa!
epuDu chErinaavu nIvu,
neyyaalato anumatini
E taMtramutO goMTivi? ||

enni kaanIlanu, varahaalanu;
raadhammaku ichchinaavu?
"kaani mATalEla?" anuchu
kOpagiMchukoMduvEla- naapaina ||

tana navvula kaDa chEar
muvva gItamainaavu!;
kanu chUpula gaddelekki,
baaga tishTha vEsinaavu! ||

Tuesday, January 11, 2011

పరిమళాల పెన్నిధి!



















గాలికి మోదం కూర్చును పూవులు
పువ్వుల నేస్తం చేయగనే
సుగంధమ్ముల గనిగా ఆయెను గాలి

పువ్వులతోటి స్నేహ హస్తమును
అందుకున్నదీ చిరు గాలి
ఐనది గాలి;
ఆ వెనువెంటనె
సౌగంధమ్ముల నిలయము, పెన్నిధి!

మలయ పవనములు సాగీ, సాగీ, పయనాలు;
పైరుల, తరువుల పలకరింపులు ;
ప్రజలందరికీ ప్రకృతి జననీ – అర్చన
ఎపుడూ ఆమోదం, అది ఆహ్లాదకరం.

ప్రకృతిలోని ప్రాణి కోటితో
జతలు కూడిన సమ తౌల్యతపై
ఉండ వలెను అవగాహన సదా సజ్జనులారా!
బుజ్జగించుచూ, నుడివెను ఉదయం.

తోడు నీడల బంధాలు, ముచ్చట్లు























కొమ్మలు -
కోయిల, పిచ్చుక, రామ చిలుకలు,
మైనా, నెమలి, పాల పిట్టలు,
అగణిత వన్నెల విహంగాళికీ ఆరామాలు !

కన్ను దోయితో సొగసు వీక్షణం
కర ద్వయముతొ కార్యాచరణం
పదముల జంట చేర్చును గమ్యం!

వీనులు రెండూ శ్రావ్య మోహనం ;
పెదవులు జత పడి, పదముల కేళీ
జతలు జతలుగా స్నేహాలు;

జట్టు కట్టిన నేస్తాలు ;
తోడు నీడల బంధాలు ;
చేతులు కలిసిన చప్పట్లు ;
జంట కవులకు ముచ్చట్లు;

Sunday, May 17, 2009

ప్రేమ గారడీ














''''''''

ప్రేమ గారడీ ;;;;;;
''''''''''


ఇంతి దోసిలిలోని
పుష్పాలపై వాలే
మిణుగురు పురుగుల రెక్కలలోనికి
నేను చిరు కాంతిగా చేరి,చిగురిస్తూ ఉంటాను

'''''''''''''''''''''''''''''''''

"ప్రేమ"
కలలలోంచి జారి పోయి
ఇలకు వాలిన ఈ రెండు అక్షరాలూ,

నీ చిరు నవ్వుల స్పర్శ సోకి
నవ చైతన్య పక్షము(=రెక్క)లతో
మరల "ఉఫ్ఫ్"న ఎగిరి,ఎగసి

తెలి రెక్కల కాంతుల వ్యాప్తిలో
తాము విస్తృత పరీమళమై
దశ దిశలకూ
పంచుతూనే ఉన్నాయి!

పడతీ!
ఆ "ప్రేమ "అనే
రెండక్షరములు చేసే గారడీ
అంతా ఇంతా కాదు సుమా!


'''''''

మదికి ఆకృతి నొసగినావు నీవు!

''''''

మదికి ఆకృతి నొసగినావు నీవు! ;;;;;;;;;;;
''''''''''''''''''''''

ప్రేమా!ఓ ప్రేమా!
అలసట చెందిన మనసులను
మరల మరల అలమట బెడుతూనే
ఉంటూంటావు!
ఇదేమి సరదా నీకు?

మనసున్న మనిషి అంటే
నీకెందుకనీ ఇంత అలుసు?!
"ఇంతింత"ని అనుకుంటూ
అంచనాలు వేయ లేనంతగా
'గడుసు దనాన్ని '
నిలువెల్లా
నింపుకున్న దానివి నీవు!

గాలికి
దూది పింజల లాగా
ఎగిరి పోతూన్న భావాలను
పరిమళ పుష్పాలుగా చేస్తావు!

గమ్యం ఎరుగని ప్రయాణాలలో
డస్సి పోయిన మనసులను
శ్రావణ నీరదములుగా
తొలకరింప జేస్తావు
చిలకరింప జేస్తావు నీవు,
ఓ ప్రేమా!


"మనసు"అనేది ఉందనీ
మదిని కలిగి ఉన్న జీవి
"మనిషి మాత్రమే!" అనిన్నీ
నీ వలననే నిరూపితమౌతూన్నది,ఓ ప్రేమా!

హృదయ తత్వ స్వరూపాన్ని
సదా
అవగతం చేస్తూనే ఉంటావు నీవు,ఎల్లరికీ!

అందుకే
ఓ ప్రేమ దేవతా!
నీకు మా శత సహస్ర వందనములు!


'''''''

చిన్నికోరిక






చిన్నికోరిక ;;;;
'''''''



ప్రభూ!
అనంత వీధిలోనుండి
వేణు రవళి గీతిని వింటూ
తలిరాకుల హిమ బిందుల
నాట్యమాడు తెలి కాంతుల
అపురూప ప్రసాదముగా
లభియించిన
ఇంద్ర ధనువు
నా నయనమ్ముల
దాచుకొనుచు
నా పయనమ్ములు
ఈ లాగున సాగనీ!

తొలి వేకువ తుల తూగెడి
రత్న ధవళ స్నిగ్ధతలన్నీ
నా కనీనికల మెరయుచుండ
నా పయనమ్ములు సగనీ!

తేలి వచ్చు
తేలిక పాటి నీలి మబ్బు నావలందు
ఆట పాటలతొ సాగెడి
'మెరుపుల బాల బాలికలతొ '
నేత్ర పర్వములు సలిపే
నా దృక్కుల
పయనమ్ములు సాగనీ!



''''''

Friday, May 15, 2009

శిల్పి














శిల్పి ;;;;;;;
''''''

ముగ్ధంగా పూల గుత్తి
భానుడు
"తన "ఉలి"
ఎక్కడున్నదో?"అనే
అన్వేషణలో ఉన్నాడు.

మరి,
ప్రకృతికి
మరిన్ని అంద చందాలను
అద్దాలి కదా!



'''''''''''








'''''''''''

తమ తమ గమ్యములు ;;;
'''''''''''''

"పరాగ యోగంలో"
పుష్పములు
విరాఆజిల్లుతున్నాయి
శశాంకుని శీతల కాంతులకూ
సప్తాశ్వ రధారూఢునికీ
తమ తమ గమ్యాలేమిటో
చిటికెలోన తెలిసి పోయాయి.




''''''''''''''''''''''''''''''''

తమ తమ గమ్యములు








'''''''''''

తమ తమ గమ్యములు ;;;
'''''''''''''

"పరాగ యోగంలో"
పుష్పములు
విరాఆజిల్లుతున్నాయి
శశాంకుని శీతల కాంతులకూ
సప్తాశ్వ రధారూఢునికీ
తమ తమ గమ్యాలేమిటో
చిటికెలోన తెలిసి పోయాయి.




''''''''''''''''''''''''''''''''

Thursday, May 14, 2009

ఊర్మిళా దేవి నిద్ర





'''''''''''''''''''''''''


ఊర్మిళా దేవి నిద్ర ;;;;;;
'''''''''''''

లక్ష్మణ స్వామి తన భార్య ఊర్మిళా దేవిని అయోధ్యలో ఉంచి,తాను అన్న గారి వెంట అడవుల కేగినపుడు ఆమె కన్న తల్లి దండ్రుల భావాల అల్జడికి "పాట రూపము ఇది.


పాట ;;;;;;
''

1)నిదుర పోవే ఊర్మిళా!నిదుర పోవమ్మా!
లాలి లాలి లాలీ జో!
మా కన్న తల్లీ!ఊర్మిళా!//

2)కడుపులోన నిన్ను దాచి
తొమ్మిది మాసములు మోసి
కన్న బిడ్డా!నిన్ను మేము
కన్నాముర,చిట్టి తల్లీ!
కను పండుగ పొంగి పోతూ

పాడినాము,హాయి!హాయీ!ఆయిరారో!
జో జో జో లాలి అనుచు //
కన్ను దోయి ఊయెలలో నిను
పొదివినాము,పెంచినాము

పసిడి తల్లీ!,ఊర్మిళా!
ఊర్ముమా!ఉయ్యాల!అనుచు //

3) 'లాల ' పోసి లాలించినాము
లాలనలలో లావణ్య రాశీ!
లాస్యమే నీ బాల్యమాయెనులే!
లాలిత్యమే నీ జీవితమునకు
ప్రతి రూపమగునని తలచినాము

హాయి!హాయి!జో హాయీ!

నాడు లాస్యమే నీ బాల్యమాయెను
నేడిటుల,నీ వదనమందున
దర హాసమీ చొప్పున మాయమాయెనుగా!


4)పువుల పదములు అలలు అలలై
నీ దోగాడు పదముల
మెత్తలైనవి
జో లాలీ జో లాలీ! //

వనము లందలి విభుని పదముల
కంటకములు తగులునేమొ!"యని
ఇచట నీవు కుందు చుంటివి
పరమ సాధ్వివి నీవు ఐతివి
కన్న తల్లీ!లాలి! జో జో! //

5)కాననముల కదలుచున్న
కాంతు తలచీ
తలచి తలచీ
"నిదుర నందున
నీదు కలలే
'కావ్యములుగా వెలయు జగమున! '

నిదురయే
'నీ బ్రతుకు 'అయిన
విధి విలాసము నేమి అందుము?
కుమిలి పోతూ,కుమిలి పోతూ
నిను కన్న వారము,
పాడు తుంటిమి,అమ్మలూ!
చిన్న బోయిన మానసములతో
జోల పాటలు,లాలి పాటలు
జో జో జోలాలీ!
ఆయిరారో! హాయిలాలో! //



'''''''''''''''''''''''''''''''''''

'''''''''''''''''''''''''''''''''''

Monday, May 11, 2009

మానవుడు భాగ్య శాలి




'''''''

మానవుడు భాగ్య శాలి ;;;;;;;
'''''''''''''''''
ప్రేమ సీమలలో
అన్వేషణయే వాడుక.

ఆ వాడుకయే కడు వేడుక.

ప్రాణి కోటిలో
మనిషికి
ప్రత్యేకం
అనురాగ భావ వ్యక్తీకరణ

ప్రణయ సౌరభ మాలికలను
దాల్చగల భాగ్యం మా'నవుని 'దే కదా!

అందుకే
మనిషి మనసు
సుతిమెత్తని ఉద్యాన వన వాటిక.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ప్రతి నేత్రంలో ఆవిష్కృతం



కాలమనే రేవు ;;;;;
'''''''''''

వెన్నెలల దారులంట
వెడతాం!వెళతాం!

ప్రకృతి కృతికి శ్రీమంతం
ప్రతి నేత్రంలో ఆవిష్కృతం
పరిఢవిల్లు రసాద్భుతం

మదను విల్లు
తన పంచ పుష్పముల కొఱకై చేయు
అన్వేషణమ్మునకు దొరికె నేడు పరిష్కారం.

శిశిర, గ్రీష్మముల వలువలు
కాలం_రేవులోన విడిచి పెట్టి
హర్ష వర్షముల కోకలు
ధరియించెను,ఋతు రాణి.


;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

Saturday, May 9, 2009

వెలుగు మీనములు




వెలుగు మీనములు ;;;;;;
'''''''''''''


జల జలా జాలారి వనితల
నవ్వుల పువ్వుల జిలి బిలి లాహిరి
నీటికై వెడలేను

కడవలో పట్టేది మంచి నీరు,
నీటిలో విరబూయు
వెలుగు నీడలను 1
ఒడిసి పట్టేస్తుంది
తన నవ్వు జాలములందు.2


'''''''''''''''''''''''''''''''''''''
1)నీడలు= ప్రతి బింబాలు,ఛాయలు
2)జాలము=వల,ఇంద్ర జాలము


'''''''''''''''''''''''''''''''''''''

''''''''''''


జో రాం దశరధ్ కా బేటా;
వహీ రాం ఘట ఘట్ మే లేట;
వహీ రాం జగత్ పసేరా."


"లోకమంతా విరాజిల్లే దశరధ తనయుడు శ్రీరామ చంద్రుడు ,
తనితీరా తలుస్తూనే ఉంటాము కదా!"


'''''''''''

Friday, May 8, 2009

పూల జడ




పూల జడ ;;;;;;
''''''

ప్రణయ దేవికి
సంగీతపు పూల జడ .

పొందికగా ఉన్న
పుష్పమ్ములు ఇవియే>>>>>>
వలపు,
లేదా తిరస్కారము;
ఉవిదా!
నీ నిరక్ష్యము,తృణీకారములు.


'''''''''''''''''''''''''''''''''''''''''

పొందిక కుదిరిన చోట


'''''''
పొందిక కుదిరిన చోట ;;;;;; 
'''''''''''''''  
ఏ నేత్రాలకు 
"దృక్కులు" ;
దిశాంతాలకు కదలికలను నేర్పిస్తాయో ; 
ఆ నయనాలను ఆరాధిస్తాను నేను.

ఏ పాదాలకు  
కాంతి నిర్ఝరీ గమ్యాలకు తీసుకు వెళ్ళే ; 
మలుపులు తెలుసునో ; 
ఆ చరణాలకు సాష్టాంగ పడతాను నేను. 

ఏ హస్తాలు 
ఆప్యాయతలను ఆహ్వానిస్తాయో; 
ఆ చేతులను 
మనసారా కన్నులకు అద్దు కుంటాను; 

ఏ మాటలకూ,చేతలకూ 
హృదయంలో పొందికగా 
"వారధి"ని కడతారో 
ఆ మానస సరోవర కెరటాల 
హృద్యంగమ గమకములలో; 
మనసారా స్థిర నివాసమేర్పరచుకుంటాను నేను!  


''''

Wednesday, May 6, 2009

"కాలము"నకు వర్తమానము పంపించేసాయి


'''''''''''''''''''


 

"నిన్న"ల దృశ్యాల పూలన్నిటినీ దులిపి వేసి 
పుటలను త్రిప్పి, 
"నేడు"ల శ్వేత పత్రాలపైన  
కొంగ్రొత్త చిత్రాలను చిత్రిద్దాం! 

రేపులన్నీ, 
తాము "వర్తమానములు"గా 
మారి పోబోతున్నామని అంటూ 
"కాలము"నకు 
అపుడే వర్తమానానిnniపంపించేసాయి  

కాలము గొప్ప సృజన శీలి! 
తాను సృష్టించే సంఘటనల 
వన్నె వన్నె పూవులతో 

"చరిత్ర"కు సొగసైన జడలను  
నిరంతరమూ అల్లగల నేర్పరి,నిపుణ శిలి!  
మూర్తీభవించిన ఆ అల్లికల సౌందర్యాలను 
మేలిమి పరదాల చాటు నుండి 
చిరు నవ్వులు చిందిస్తూ 
"భవిష్యత్తు" 
సుతారముగా 
అడుగులు వేస్తూ వస్తూన్నది.  

ఆ "నడకలు" 
మనోజ్ఞమైన నర్తనములు కావాలి. 
అవి, 
వర్తమానపు మనోరంజన లాస్య 
నాట్య భంగిమలకు విలాసములు
(=అడ్రసులు) కావాలి. 

నవ్య కాల చిత్ర రచనలను 
"చరిత్ర" 
తన మెత్తటి పొత్తిళ్ళలోన  
మమతానురాగమ్ముల హత్తుకోవాలి!  


''''''''''''''''''''''''''''''''

Monday, May 4, 2009

చెకు ముకి రాళ్ళు








''''''''  
చెకు ముకి రాళ్ళు
'''''''''''''  
విరహాల చెకుముకి రాళ్ళ నుండి ; 
విచ్చల విడిగా వెలువడుతూన్న నిప్పురవ్వల్లారా! 
పొండి! 
ప్రేమ జంటలనాగినీ క్రీడల భోగి మంటలకు ; 
miiru"ఇంధనపు పొడి"గా మారి పొండి! 

మమతాను రాగ సంక్రాంతి పర్వాల సందడిని 
ప్రేమికుల ప్రపంచములలో వెలిసేలా చేయడము
అనే "విధి",'కర్తవ్యములు ' 
మీకు మాత్రమే  
ఆచరణాత్మకంగా కల 'హక్కు 'అనీ
తక్షణమే నిరూపించుకోండి! 
ఓ చెకుముకి రవ్వల్లారా!  


'''''''

Tuesday, April 21, 2009

మకరందము

మకరందము




మల్లెలు విరిసిన గ్రీష్మపు వేళ 
హేమంతపు సిరి ఒడి నిండిన వేళ 
ఇదేమి కీల? ఇదేమి జ్వాల? 
పదే పదే 
మది , మదిని 
నెమ్మదిగ 
నిదుర లేపునేల? 
ఈ వలపు జోల గోల! // 
తానే, తానే,తనే, తనే 
మొయిలు తునకగా విచ్చేసి 
నా ఎడద గృహమునకు వచ్చేసి 
పన్నీటి చిందుల పలకరింపులే తానై 
వలపు వెల్లువగ వెల్లడించును 
ప్రణయ పుష్ప మకరందం //


Wednesday, April 1, 2009

ప్రశ్నార్ధకము











ప్రశ్నార్ధకము :::::
'''''''''

ఈ ప్రశ్నార్ధకమేమిటి?
ఎప్పుడూ జీవితపు లోతు పాతుల్ని 
చిలుకుతూనే ఉంటుంది!?!;

ఆనందపు అవధుల్ని
కొలుస్తూనే ఉంటుంది;
చిరు నవ్వుకూ,
చిరు కోపానికీ మధ్యన ఉన్న
'సరి హద్దు అంతరపు 'మందంపై
తను సారించిన దృక్కులను
అలాగే నిలిపి ఉంచుతుంది;

ఆలోచనకు నాందియై
అన్వేషణకు ఆనవాలు ఐ
పరిశోధనకు ప్రాణమై
'రేపటి ప్రగతి 'కి
ఆస్తరణమై వెలుస్తుంది.

ఏవిషయాన్ని గానీ,
దేనినైనా గానీ
స్థిమితంగా నిలవ నీయదు
అదేమి చిత్రమో గానీ
తాను మాత్రం
"ప్రతి ఆలోచన కొసలోనూ
స్థిరంగా.....
సుస్థిరంగా పీఠం వేసుకుని ,
బైఠాయించి మరీ కూర్చుంటుంది.


'''''''