Wednesday, March 17, 2010

కథలకు లోగిళ్ళు





















జగముల ఏలిక కన్నయ్య –వగలొలికే భామా మణికీ
వగరు ఊసుల తొగరుల ముచ్చట్లు – వీనుల విందులు ఓ యమ్మా! ||

జగడము లుత్తుత్తి ప్రణయ కలహాలు – ముజ్జగ యానపు నారద మౌనికి
తెగ పని కల్పన – మహతికి త్రుళ్ళింత - వీనుల విందులు ఓ యమ్మా! ||

గగనపు నీలము స్వంత దారుడు – మగ నాలు రాధలో సగ భాగమయేను
భగవంతుడు భక్తుల దాసుడు నిత్యము -కన్నుల పంటలు ఓ యమ్మా! ||

అగపడడాతడు కన్ను దోయికి – ఖగ, రజ వాహను ( ని ) దాగుడు మూతలు
నగవుల నాట్యము, లలిత కళలకు ,కేంద్రము ,కనుకనె కమనీయములు
కమ్మని కథల లోగిళ్ళు – ఇమ్ముగ మనకు దక్కినవి ఓ యమ్మా! ||


Kovela

కథలకు లోగిళ్ళు
By kadambari piduri, Mar 9 2010 5:05AM

రాగ వీణ రాధిక






















ప్రణయ సుధా కలశమ్ము- రాధిక
విభ్రమము తన ఊసుల - చరితల రచన ||
చరితార్థము ఆ నుడువులు – ఏమరక మననములు -
మరి మరీ చేసేటి - భక్తులు చరితార్ధులు ||

రాగ వీణియ రాధమ్మ - నిగ నిగల చెక్కిళ్ళ లోన
తన వెన్నెలల సిరి సంపదలను - గడుసుగా
దాచుకొనె మబ్బుల్ల జాబిల్లి ;
శశాంకు పోకడలకు - ఈసు పడె తారకలు ||

గిల్లి గిల్లి కజ్జాలా!?! –
అల్లరిగా , ఆ పైన
మళ్ళిన కినుకల తో
మల్లె , మొగలి తావి పిలుపులా !?
బహు చోద్యమ్ము లేవమ్మ ! నీ రీతులు !
ఒహొ !కోమలాంగీ !
ఓ సుందరాంగీ! రాధికా! ||

ఎల్ల లోకములను చల్లగా ఏలేటి
ఆది విష్ణువు నేడు నీ జడ పాయలందున

అల్లికల మొగలి రేకులలోన చిక్కు కొనినాడమ్మ!
బులి బుల్లి నీ దొండ పెదవులతో వెల్లడిని సేయవు!?
తేట తెల్లమొనరించవు - ఈ లాగు నీ రీతి
బులిపించుతున్నావు !!
బహు చోద్యము నీ రీతులు ||

Kovela
రాగ వీణ రాధిక

By kadambari piduri, Mar 9 2010 5:02AM

Thursday, March 11, 2010

జయ మంగళం ! నిత్య శుభ మంగళం!
























దిక్కులకు ఆదియౌ - చక్కనీ స్వామికి
జయ మంగళం , నిత్య శుభ మంగళం ||

పచ్చ తోరణములతో – నిత్య వైభోగి స్వామి
జయ మంగళం , నిత్య శుభ మంగళం ||

హెచ్చుగా భక్తులకు – అచ్చ కల్ప తరువీవుగా
లచ్చణంగా దక్కితి వదె - పది వేలు ,లచ్చ వరహాలు
జయ మంగళం , నిత్య శుభ మంగళం ||

నిక్కువము మా కెపుడు – చుక్క పొడుపుల మేల్మి
మక్కువౌ పర్వముగ – మిక్కుటముగ నీ ధ్యాస
చక్కనీ శ్రీ వేల్పు తిరు వేంకట నాథునికి
జయ మంగళం , నిత్య శుభ మంగళం ||

నచ్చి నిన్ను వరియించిరి –
లచ్చిమి , అలి వేల్మంగమ్మలు -
విచ్చేసిరి భక్త కోటి -
రచ్చ సేయకుండా ,ప్రొద్దు పుచ్చ కుండా -
నచ్చ జెప్పి స్వామిని - పంపరమ్మ కొలువులకు -
శుభ మంగళమనుచును
జయ మంగళం నిత్య శుభ మంగళం ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


జయ మంగళం ! నిత్య శుభ మంగళం!

By kadambari piduri, Mar 9 2010 5:00AM

Wednesday, March 10, 2010

బొమ్మలో మరో బొమ్మ (inner figure )



Hello Friends !,

I bommanu jaagrattagaa tilakiMchaMDi.
" bomma lOpala marO bomma unnadi; kanukkOMDi! "

ఈ బొమ్మను జాగ్రత్తగా తిలకించండి.
" బొమ్మ లోపల మరో బొమ్మ ఉన్నది; కనుక్కోండి! "

Appreciate the artist's ' praj~na".
Thank you !


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

చల్లగా చూడవయా !
























మనుజాళి నీ అనుగు బిడ్డలే గాన
నీ కనుపాపలో దాచి - కాచుకోవయ్యా! ||

విను వీధి గోళములు - విశ్వ కాంతులతో
అనువైన సీమగా - నీ నేత్ర ద్వయమును
ఎంచుకుని అందునే తిష్ఠ వేసాయిర స్వామి!
చినుకంత ఈ నీ దృక్కు - జగమంత వెలుగులే! ||

విల్లు పూవుల దొరకు - జనకుడవు నీవయ్య!
ఎల్ల లోకములకు - మానికపు అయ్యవు !
కొల్లలుగ కానుకలు - ఏమీయ గలము?
ఉల్లముల నిండుగా - మా భక్తి శ్రద్ధలు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
Kovela

చల్లగా చూడవయా

By kadambari piduri, Feb 18 2010 9:13AM

రెండు పేర్లా?



















చెవుల పిల్లి అంటే తెలుసా మీకు?
తెల్లని rabbit బుజ్జి కుందేలు

2. "లొట్టి పిట్ట” అని దేనికి పిలుపు?
( ans::: )
“ఎడారి ఓడ”ని పేరు పొందిన
ఆంగ్ల camel; అంధ్రా ఒంటె”

3. సీతా రాముల నేస్తాలు
కోతి, చిలుక, ఉడుతలయా!

కోతి కొమ్మచ్చి ఆటలు ఆడీ, నేర్చి
ఉడుతా! ఉడుతా! హూత్ !
ఎక్కడి కెడతావోచ్ !

“ దాగుడు మూతలు, దండా కోరని
బారెడు, క్రోసెడు, యోజనమ్ములు!”


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Baala ( click here . )


By kadambari piduri, Feb 14 2010 12:33AM

Saturday, March 6, 2010

అవతార మూర్తి
















పూవింటి దాల్పు జనకుడా!
మదిని నిను –
భావించగానే బ్రోతువని వింటి!
" గోవింద ” -
నామము మహిమ అంతటిది ! ||

వల్ల మాలిన కోపమేలయ్యా?
ఛల్లనయ్యా! తాల్మి దాల్చుము
" వల్లకో ”మన కినుక లింతేల?
నల్లనయ్యా! నవులు చిందించు! ||

హరి చందనాలను చల్లమన్నావా?
మరి, చల్లలమ్మే గొల్ల భామల
సిరి కంటి చూపుల
విరుల తావుల చల్లమన్నావా? ||

నవ పారిజాతము దండ లివిగోరా!
వివిధాకృతుల మణి – హారమ్ము లివి నీకే!
అవతార పురుషుడ వీవె! తెలుసునులే!
ధవళ హాసా! వందనమ్ములివే! ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

అవతార మూర్తి

By kadambari piduri, Feb 27 2010 5:25AM

Friday, March 5, 2010

శరణు శ్రీ పదములకు
























శరణు శరణు స్వామీ –
శ్రీ పదములకు
తరణము నీ కై దండ
అరణముగా దొరకె నాకు ||

అదియె కదా –
గగనాత(ప)పత్ర –
మది చల్లని నీడ
వెదుకనేల ఇతరములను
శ్రీ పథము వెలుగు జాడ ||

నీవె దైవమని నమ్ముట
దైవికమే కాదా!?
నేవళమౌ పరం జ్యోతి
కైవశమయె నేడు నాకు ||


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Kovela

శరణు శ్రీ పదములకు

By kadambari piduri, Jan 22 2010 8:27AM

Wednesday, March 3, 2010

అందం ఆనందం
























తోటలొ పూవులు అందం
పూల పరిమళములు ఆనందం

వన్నెల వాలే ఉషా కాంతులు
జగతికి ఒసగే ' మెలకువ ' అందం, ఆనందం.

కొమ్మల వాలే పక్షులు అందం
నీడను ఒసగే చెట్లు అందము.

ఆకుల, పైరుల పచ్చ దనాలు
ప్రకృతి కొసగే శోభలు అందం, ఆనందం.

చెమ్మ చెక్కలు, చారెడు మొగ్గలు
ఒప్పుల కుప్పల ఆటలు అందం.
క్రికెట్టు, హాకీ, కేరంసు
చెస్సు,పజిల్సు అన్నీ అందం!

ఆటల పాటల సందడి వలన
అందరి నవ్వుల స్నేహం, మైత్రి
అందం, ఆనందం.


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


Baala

అందం ఆనందం

By kadambari piduri, Feb 25 2010 7:03PM

అదే తిరుమల!
























శ్యామ సుందరాంగా!
శరణు జొచ్చినారము
నీ - ప్రేమ మందిరము కదా,
భక్త హృదయ పద్మము ||

శరణు! శరణు! శరణనుచూ
ఎలుగెత్తుచున్న పలుకులు
అనయము అవి మావి!
అరణము నీ అనునయము
ఆ ఆస్థి అంత మాది ! ||

గోవింద! గోవిందా! - అనుచు
సాగు మా పరుగులు
అదె కొండల కోవెల
మా అడుగు జాడ మెరుపు చెండ్లు
గమ్యము అదే తిరుమల ||


Kovela

అదే తిరుమల!

By kadambari piduri, Feb 27 2010 7:59AM

Tuesday, March 2, 2010

ఆలోల తులసీ వన మాల,రామా!




















భజనలు, కీర్తనలు

ఆలోల తులసీ వన మాల,రామా!
శ్రీరామా! రఘు రామా!

భవదీయ పదములు, రామా! –
నే నిరతము కొలుతునురా రామా!
శిష్ట జన ప్రియ రామా!
శ్రీరామా!జయ రామా!

కోదండ పాణి రామా!
నినె - కోరి,కొలుతును రామా!
నినె నమ్మితిని రామా –
నను నిరతము బ్రోవరా రామా!

దిక్కు నీవె యని రామా –
నే - నిక్కము నమ్మితిని రామా!
కోమల మృదు పద రామా –
శ్రీరామా! – రఘు రామా!

ఆర్తితో వేడితి నిను రామా! –
నన్నాదరింపరా రఘు రామా!

{ sekarana from old books }

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


bhajans and kirtans

aalOla tulasii vanamaala,raamaa!
SrIraamaa! raghu raamaa!

Bhavadiiya padamulu, raamaa! –
nE niratamu kolutunuraa raamaa!
SishTa jana priya raamaa –
Sriiraamaa ,jaya raamaa!

kOdaMDa paaNi raamaa –
nine - kOri,kolutunu raamaa!
nine nammitini raamaa –
nanu niratamu brOvaraa raamaa!

dikku niive yani raamaa –
nE - nikkamu nammitini raamaa!
kOmala mRdu pada raamaa –
SrIraamaa! – raghu raamaa!

aartitO vEDiti ninu raamaa! –
nannaadariMparaa raghu raamaa!

( collections from old telugu literature )

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

కొంగు బంగారం



















చెంగు చెంగు గంతులతో
అమ్మ- కొంగునందు దాగేవు; ||

నీ కొంటె ముద్దు ఎంగిళుల ముద్రలన్నియున్నూ ;
చీర చెంగు కావ్యములే ఆయెనంట!
యశోదమ్మ కొంగు బంగారమా! రా !
క్రిష్ణయ్య! శోధించుట నీకు తగదురా ! ||

మదన కోటి సుందరా!
నీ సదనము ఈ తిరుమల!
ఇది - హేతువు అయ్యినందునే
క్రిష్ణయ్య! -
పృధివి దివిగ పరిణమించెరా! ||

కుండలీ శయనుడా!
అండ మాకు నీవేరా!
అఖండ భక్తి పరిమళమ్ములు
మా తండ్రీ! ;
గైకొనుమా వందనములతో ||

చెంగు చెంగు గంతులతో
అమ్మ- కొంగునందు దాగేవు ....||

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

Kovela

కొంగు బంగారం

By kadambari piduri, Jan 4 2010 9:31AM