Tuesday, August 2, 2011

కోతి పళ్ళు


Monkey Biscuit Tree

దక్షిణ గుజరాత్ లో, మధ్య ప్రదేశ్ లో అడవులలో
పరిశోధకులకు కనిపించిన విశేష వృత్తాంతము ఇది.
పటాల్ కోట  పరిసరాలలో కోతులు ఈ ఫలములను తింటూంటాయి.
ఆ వానరములు గర్భమును దాల్చినప్పుడు,
పిల్లలను ప్రసవించిన  తరువాత దేహ ఆరోగ్య భద్రతకు
ఇవి ఉపయోగిస్తున్నాయని ఆదివాసీలు, ప్రజలు తెలుసుకున్నారు.
"వానర ఫలములు" - అని ఒక జాతి తరువుకు కాస్తూన్న 
కాయలకు పేరు వచ్చినది.
పటల కోట్ వద్ద సర్వేలో ఈ విశేషాన్ని కనుక్కున్నారు.
(HOLOPTELEA INTEGRIFOLIA: MONKEY’S FRUIT)
హోలొప్టేలియా జాతి చెట్టు వైద్య పరంగా విశిష్టమైనది.
అక్కడి కొండ జాతి ప్రజలు, గిరి జనులు 
ఈ తరు సంపదను చిట్కా వైద్యాలకు బాగా వాడుతూన్నారు.
అనేక జంతువులు, పక్షులు ప్రకృతి సిద్ధంగా
తమ ఆరోగ్య భద్రతా విధానాలను ప్రకృతి నుండి,
చెట్లు, ఫల పుష్ప పత్ర సంపదలనుండి,
పంచభూతాలనుండీ - అనగా - "భూమిరాపో అనలో వాయుః"
నేల, నింగి, నీరు, నిప్పు, గాలి -
వీనిని తమ శరీర స్వభావానుగుణంగా ఎలా వాడుకోవచ్చునో తెలుసుకుని,
ఆచరిస్తూన్నాయి, ఆయా ప్రకృతి జీవజాలములను పరిశీలించడము వలన, 
ఆయుర్వేదము, యునానీ, సిద్ధ వైద్యాది పద్ధతులు అభివృద్ధి గాంచి,
మానవాళికి ఇతోధికంగా ఉపకరిస్తున్నవి.


Indian Name: चिरबिल्व, पापडी, वावळ              
English Name: Monkey Biscuit Tree                        
Botanical Name: Holoptelea integrifolia planch
Tribals in both these remote areas of India use
Holoptelia in many herbal practices.

          Monkey Fruits  (Link)

No comments:

Post a Comment