Sunday, August 28, 2011

ప్రకృతి మన దేవత






















ప్రకృతి అణువణువుతో - నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య - గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణయ్య! ||

అద్రి పూజలను మాకు నేర్పినావు క్రిష్ణ!
“భద్రంగ చేయాలి- గిరి తరువు సంపదలు!
ప్రకృతి మన దేవత" అని సెలవిచ్చినావు;   ||

"ఆలమంద, పశువులు- ఆలనా పాలనలు
మేలైన అలవాటు మందికి!"- అంటివి
జల యమున ఆరాధ్య దేవతని నీ వాక్కు ||

నాట్య నెమలి కనులు – నీ సిగలోని పూవులు;
పక్షులతో ఆటలు కంటి విందులు;
"ప్రకృతియె దేవత"ని సెలవిచ్చినావు;    ||

ప్రకృతి అణువణువుతో - నిత్య సావాసము-
నీవు నేర్పిన విద్య గోవర్ధనోద్ధారి! గోపాల క్రిష్ణా!   ||


   [ప్రకృతి మన దేవత    20 Jul 2011 ]

No comments:

Post a Comment