Friday, August 26, 2011

ములగ చెట్టు ప్రయోజనాలు








ఫ్రికా దేశాలలో ములగ కాయ విత్తనాలతో - కాలుష్య జలములను -
వాడుకునే మంచి నీళ్ళుగా మార్చుతున్నారు.
రుబ్బిన/ గ్రైండ్ చేసిన ములక్కాయ విత్తుల గుజ్జును రెడీ చేస్తారు.
ఆ Moringa seeds పిండిని 2 స్పూన్లు తీసుకుని,
సీసా నీటిలో లో బాగా కలియబెడ్తారు.
ద్రావణము కలుష జలాలను శుద్ధి చేయడానికై ఉపయోగపడ్తుంది.
purify చేయవలసిన నీటిని/ మురికి నీటిని -
ఒక బక్కెట్టు, లేదా పాత్ర, కుండ లో ఉంచాలి.
ఆ కడవకు/ గిన్నెకు ఒక పలుచని వస్త్రాన్ని-
వాసెన గుడ్డలా కట్టాలి.
ముందుగా ఉంచుకున్న
ములక్కాడల సీడ్స్ యొక్క గుజ్జు సారాన్ని
ఆ క్లాథ్ పై పోస్తూ నెమ్మదిగా వడబోయాలి.
ఇలాగ జల్లెడ పట్టిన ద్రావణము కింది గిన్నెలోని
మురికి నీళ్ళలోకి - నెమ్మదిగా కలుస్తుంది.
ఆ రెంటి మిశ్రమాన్నీ బాగా మిళితం చేయాలి.
కొన్ని గంటల సేపు, ఆ నీటిని కదిలించకుండా అలాగే అట్టిపెట్టాలి.
అప్పుడు - మంచి నీరు- మన చేతిలో రెడీ!
ములగ విత్తనాలతో జలశుద్ధి

మొరింగా ఒలియ్ఫెరా (Moringa Oleifera, ) చెట్టును
 ఆఫ్రికా కంట్రీలలో ప్రజలు -మిరక్ల్ ట్రీ- (Miracle tree)అని అభివర్ణిస్తారు.
ఈ ములగ చెట్టు ఆమూలాగ్రమూ ఉపయోగ, ఉపకారియే!
కాయలను మాత్రమే కాకుండా, ఆకులను, పూలనూ/ పూతనూ,
బెరడునూ విస్తృత ప్రయోజనములకు వాడగలుగుతున్నారు.
ఆకుల పొడి వంటలో, ఖాద్య వస్తువులలో మాత్రమే కాక,
వైద్యంగా సైతం వాడబడ్తూన్నది.
ఈ ఆకులపొడిని క్యాప్సూల్సు గానూ,
నూనెను కూడా వినియోగిస్తూన్నారు.
 విదేశీ ద్రవ్యాన్ని ఆర్జిస్తూన్న స్థాయిలో
ఆయా దేశాలలో ములగ చెట్టు వినిమయం ఔతూన్నది.
దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా అత్యంత వేగంగా -
తమను తాము మలుచుకుని, పెరుగుతూ, నిలదొక్కుకునగలవు వృక్ష జాతి.
ఫ్రికా ఖండములో -ములగ చెట్టు
( అక్కడ, కొన్ని ప్రదేశాలలో  హార్స్ రాడిష్ అనేపేరును కూడా కలిగినది)
మనకు వింతగానే అనిపించవచ్చును కదా!
ఈ ఫొటోలో గమనించండి (Link)
Maldivians people ఇష్టంగా తినే వంటకం Garudiya.
గరుడీయ - అనే సాంప్రదాయ (ములగ) వంటకమును 
మాల్ దీవులలోని ప్రజలకు ప్రీతిపాత్రమైనది.
:::::::::::::::::
మైకా దేశంలో ములగ రెమ్మల, కణుపుల నుండి
నీలి రంగు రసాన్ని తయారు చేసి, వస్త్రాలకు,
అద్దకం వలె వాడుతారు.(In Jamaica, the sap is used for a blue dye.)
బెన్ ఆయిల్ ములగ తరువు నుంది కలిగే ఉత్పాదన.
బెన్ ఆయిల్ ట్రీ - అని దీనిని పిలుస్తున్నారు - అంటే
ఆ తైలం యొక మార్కెట్ పరిధిని ఊహించవచ్చు.
తమిళనాడు, కేరళ ఇత్యాది రాష్ట్రాలలో
ఆయుర్వేద, సిద్ధ వైద్య విధానాలలో
ఈ ములగ నూనె (Ben oil) వాడబడ్తూన్నది.

{ BEN OIL TREE)   ; TreeWater Treatment with Moringa Seeds}

జల శుద్ధి (Link for Essay)



No comments:

Post a Comment