Thursday, August 4, 2011

అచ్చులకూ, హల్లులకూ సఖ్యత


















"అ"నుండి "క్ష" వఱకు - అక్షర మాల
అచ్చులకూ, హల్లులకూ సఖ్యత, కడు మైత్రి;
కలిగినపుడు వెలిసాయి వాక్కు, శబ్దం!

శ్రీ వాణీ హస్తమున;
అక్ష మాల, పుస్తకం;
శోభాన్విత ఆభరణం, దేదీప్యం ప్రకాశం!
"పుస్తకం హస్త కమల భూషణం"
అను సామెత సర్వ విదితం:

అక్షర పద విన్యాసం;
భావములకు చిత్రణం;
అందుకే మనమందాం- ఓ నేస్తం!
"ఎచట లిపి, అక్షరం పూజ్యనీయమౌనో 
 అచటనే విజ్ఞానం ఉజ్జ్వల ప్రకాశం"



No comments:

Post a Comment