Monday, October 1, 2018

చూడామణీ, కౌస్తుభ హారములు యశోదమ్మ వేసింది

ఆటలకు వేళాయెరా! పాటలకు వేళాయెరా! 
మురిపాల క్రిష్ణయ్య! రావయ్య వేగమే! ;  ||
;
కస్తూరి, గంధములు నీ మేనంత అలదింది
చూడామణీ, కౌస్తుభ హారములు వేసింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
నెమలీక సిగలోన ముడిచి సింగారించింది ;
తల్లి యశోదమ్మ! రావయ్య వేగమే! ;  ||
;
మా నందనందనా - వేగమే రావయ్య! 
ఆనంద మోహనా. క్రిష్ణయ్య! రావయ్య! ;  || 

No comments:

Post a Comment