Monday, October 1, 2018

నీ షోకులు, ఠీకులు - పల్లెను మరిచేవు

నీ షోకు ఠీకుల - పల్లెను మరిచేవు ;
మా వ్రేపల్లెను మరిచేవు - మరి చాలు! చాలును! ;  ||
;
అద్దమున నీ మోము అందాలు - చూచుకొనుచూ
అట్టె నిలిచేవు - మరి మరీ మురిసేవు!
గారాలివే! వేలు ! మరి ఇంక చాలును ! గోపాల! ;
;
కొలను తన ఒడలంత అద్దముగ చేసెరా,
నీరాడు ఆటలకు నీ రాక కోసమై !
జల క్రీడ లాడేటి నీ స్పర్శ కోసమై!
నీరాజనము లొసగ - మై దర్పణము చేసి,
వేచేను ఆ యమున - వేగ రావోయీ !
మా ముద్దు గోపాల! మురిపాల బాలకా! ;  || 
;

No comments:

Post a Comment