Tuesday, October 2, 2018

పూల తెప్ప - రాధాకృష్ణులు

పల్లవి ;- 
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
రాగాల తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;  
హరివిల్లుల తులమానిని ; ఆయెనమ్మ చిన్ని పడవ ;  ||
;
ప్రణయ వేణు మధు గీతికా యుగళం - 
గాధా పరిచంక్రమణం ; 
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;
పూల తెప్ప పైన విహరించే క్రిష్ణ రాధ జంట :  || 
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; ప్రతి యోచన 
లాలిత్యం ; నూత్న సురభిళ పుష్పం ;  ||
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
నిఖిల భువన సామ్రాజ్యం, మనోహరం, మనోజ్ఞము;
తెప్ప పైన విహరించే - క్రిష్ణ రాధ జంట ;

No comments:

Post a Comment