Tuesday, October 2, 2018

కార్వేటి శ్రీవేణు గోపాలుడు

విహారములు, విహారములు, ;
వాహినిలో విహారములు, ;
పూల తేరు నావ నెక్కి, 
రాధికాకృష్ణుల  మధు విహారములు ;  ||
;
బృహత్తరం, ధృవతారా శోభా సంకలనం ; 
రాధా దరహాసం, భామా మృదు హాసములు ;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;  
;
హత్తుకొనును ఏవేవో మధురోహల లాలనలు ; 
ప్రతి యోచన లాలిత్యం, నూత్న సురభిళ పుష్పం ; 
ఒత్తుగాను పింఛములను పరచినారు ఎవ్వరు!?
కూర్మి కార్వేటి శ్రీవేణు గోపాలుడు, ఓ యమ్మా ;  || 
;
పూల తేరు నావలోన,
రాధికా కృష్ణుల మృదు విహారములు ;

No comments:

Post a Comment