Tuesday, August 23, 2016

వన భోజనములు

బంతి భోజనముల వేళ మించిపోవురా! ; 
వన జనముల సందడులు; 
నోట నీరు ఊరుచుండు, 
ఒకటే ఉవ్విళ్ళు : 
రా రా! కృష్ణా! వేగమె రారా! కృష్ణా! ||
;
బంతులాటా లాడేవు; బంతులేసి; 
పరుగు లెత్తి, దోబూచులు ఆడెదవు ; 
వేళమించి పోవురా! వైళమె ఇటు రారా కృష్ణా! || 
;
పూబంతి, చేమంతి, కనకాంబర పూవులను ; 
వనితా కేశములందున ; ఇట్టే తురుముతావు ; 
“అందున్ సప్తమి “ అంటూ చిలిపిగాను నవ్వెదవు ||
;
తుంటరిగా – వెక్కిరింపు పేర్లు – ఎన్నొ పెడతావు ; 
కొంటెకోణంగికి ‘నామ - వాచకము ‘ లన్నియు ; 
తెలుసుననే సంగతి మాకెప్పుడో తెలుసునురా! ||:-
;
========================;

# ; wana bhOjanamulu ;-

bamti bhOjanamula wELa mimchipOwuraa! ; 
wana janamula samdaDulu; 
nOTa niiru uuruchumDu, okaTE uwwiLLu : 
raa raa! kRshNA! wEgame raaraa! kRshNA! || 
;
bamtulaaTA laaDEwu; bamtulEsi; 
parugu letti, dObuuchulu ADedawu ; 
wELamimchi pOwuraa! waiLame iTu raaraa kRshNaa! || 
;
; puubamti, chEmamti, kanakAmbara puuwulanu ; 
wanitA kESamulamduna ; iTTE turumutaawu ; 
“ amdun saptami “ amTU chilipigaanu nawwedawu ||
;
tumTarigaa – wekkirimpu pErlu pErlu – enno peDataawu ; 
komTekONamgiki ‘naama - waachakamu ‘ lanniyu ;
telusunanE samgati maakeppuDO telusunurA! ||
;
వన భోజనములు ;-   [ పాట 21 ; బుక్ పేజీ 32  , శ్రీకృష్ణగీతాలు ] 
& రాధామనోహర 

No comments:

Post a Comment