Friday, August 26, 2016

మురళికి మ్రోగే వేళాయె!

మబ్బులలోన మెరుపుల్లు ;
వేణువులోన రాగాలు  ||
మురళికి మ్రోగే వేళాయె!
;        వంశీక్రిష్ణా! తామసమేల!?
           పిల్లనగ్రోవిని ఊదుము కన్నా!            ||
;

పిల్లనగ్రోవి జత చేరేనా!?
వాణీ వీణా నాదము వైలమె
జతులను తనకు జతకూర్చుకునేనా!?   ||
;        వంశీక్రిష్ణా! తామసమేల!?
           పిల్లనగ్రోవిని ఊదుము కన్నా!            ||
;
మురళీ రవళి జత చేరేనా!?
ఆదిదంపతుల పదముల కదలికలు
రజతాద్రిని చక్కని నాట్యమయేనా!?
;        వంశీక్రిష్ణా! తామసమేల!?
           పిల్లనగ్రోవిని ఊదుము కన్నా!            ||

********************************************,
;
కొత్త నెమలి పింఛాలు , జడివాన ;- kotta nemali pimCAlu ;

No comments:

Post a Comment