Tuesday, August 23, 2016

నీల మేఘశ్యామా!

నీల మేఘశ్యామా!  
నా జీవన మధురిమా పరివేదనకే ; 
పలుకులు నేర్పిన 
వర వీణా సౌభాగ్య రగ గమకమా!!;  ||
వేయి రేకులను విచ్చి చూచెను : 
కొలను నీటిని కమలం ; 
వేయి కన్నులను విచ్చి చూచెను 
నెమలి పురిలోని పింఛము ;  ||
;  
రేయి వాకిలి తెరచి ఉంచెను ; 
పూర్ణ చంద్రమబింబము ; 
హాయి శయ్యను పరచి ఉంచెను, 
‘ప్రేమ పూర్ణ హృదయం ;
ఈ రమణి రాధికా హృదయం;  || 
;
==========================,

          niila mEGaSyAmA! 
;
niila mEGaSyAmA! 
naa jiiwana madhurimaa pariwEdanakE ; 
palukulu nErpina 
wara wINA sauBAgya raga gamakamA!!;  ||
wEyi rEkulanu wichchi chUchenu : 
kolanu nITini kamalam ; 
wEyi kannulanu wichchi chuuchenu 
nemali purilOni pimCamu ;  ||
;  
rEyi waakili terachi umchenu ; 
puurNa chamdramabimbamu ; 
haayi Sayyanu parachi umchenu, 
‘prEma puurNa hRdayam ;
ii ramaNi raadhikaa hRdayam;  || 
;
[ పాట 25 - 36  ;  శ్రీకృష్ణగీతాలు  ]  

No comments:

Post a Comment