Friday, August 26, 2016

అప్సరసల కానుక

చిట్టి చుక్క పూలు 
కుట్టినట్టి జంపకాణను ; 
ఆ యమునకు కానుకగా 
కొనితెచ్చిరి అప్సరలు ||
;
ఓ యమునా! ఈ వేళ 
ఎంతెంతో సుదినమమ ; 
అల కోటలోన ఆ మూలన ; 
కంసుని చెఱసాలలోన ; 
మ్రగ్గుచున్న దేవకికి ; 
నొప్పులు వస్తూన్నవి, 
పురుటి నొప్పులు వస్తూన్నవి ||
;
అష్టమ గర్భమ్ములోన ; 
అలవోకగ చిందులేయు ; 
బాలకృష్ణునిక ఎవ్వరు ఆపగలరు!?
అందులకే - 
దివినున్న అచ్చరలు ; 
చిట్టి చుక్క పూలను 
కుట్టి, రత్నకంబళమును ; 
హర్షము ఉప్పొంగుచుండ - 
బహుమతిగా ఇచ్చినారు 
;
*************************************. 
;
[ పాట 43  పేజీ 49 ;శ్రీ కృష్ణగీతాలు ]

అప్సరసల కానుక [ अप्सरा ] = రాధా మనోహర 

No comments:

Post a Comment