దొన్నె కొలనున తేలుచున్నది;
దొన్నెలోన ప్రేమ జంట;
క్రిష్ణ రాధికల జంట ;
నిఖిల సృష్టికి కన్నులపంట ||
;
పుప్పొడుల మెరుపులు -
శ్రీక్రిష్ణ యుగళం ;
పూవు వోలె దొన్నె పడవ -
సరసు తామరల సాటిగ ;
మరి కలువలకు కూడ పోటీగా ||
;
దేవలోక సరోవరం ఇట ;
వెలసినదని భ్రమసిరేమో ;
గంధర్వ లోకము ఇటకు దిగింది ;
తమ సంగీత వాద్య పరికరములను గైకొని! ||
;
కొంగ్రొత్త యుగళ గానములు ;
ఎల్లెడల సాగెను ; ;
నూత్న గమకము, గీతులను ;;
ఆవిష్కరణమ్ములు సేయుచూ! ||
;
; by;- [ క్రిష్ణ మురళి]
;
======;=================;
;
donne kolanuna tEluchunnadi;
donnelOna prEma jamTa;
krishNa raadhikala jamTa ;
nikhila sRshTiki kannulapamTa ||
;
puppoDula merupulu -
SreekrishNa yugaLam ;
puuwu wOle donna paDawa -
sarasu taamarala saaTiga ;
mari kaluwalaku kUDa pOTIgaa ||
;
dEwalOka sarOwaram iTa ;
welasinadani bhramasirEmO ;
gamdharwa lOkamu iTaku digindi ;
tama samgeeta waadya
parikaramulanu gaikoni! ||
;
komgrotta yugaLa gaanamulu ;
elleDala saagenu ;
nuutna gamakamu, geetulanu ;
aawishkaraNammulu sEyuchU! ||
; by;- [ krishNa muraLi] ఉపత