వేయి నోళ్ళ కొనియాడుదును ;
నాదు - డెందమునే నిండియున్న వాని రూపమును! : ||
;
నుదుటను మెరయును కస్తూరి తిలకము ;
నీలి కురులలో మయూర పింఛము ;
మృగ, మయూరములు మున్ను తామెంత ;
తపమున కన్నయ సన్నిధి పొందినవో! : ||
;
మోవి చివురున అల్లదె వేణువు ;
వేణువు పయిన చివురు వేళ్ళు ;
ముందు జన్మమున 'మురళి ' తానెంత ;
పుణ్య భాగ్యమును పొంది యుండెనో : ||
;
గళమున ఆడెడు పూవులదండలు ;
ముద్దిడు తనువున అలదిన గంధము ;
నందనందనుని కమ్మని తావుల ;
కౌగిళులొసగిన పూర్వ సుకృత మెంతటిదో!: || :
;
====================================;
;
gaana sudhalu ;-
;
wEyi nOLLa koniyaaDudunu ;
naadu - DemdamunE nimDiyunna wAni rUpamunu! : ||
;
nuduTanu merayunu kastuuri tilakamu ;
niili kurulalO mayuura pimCamu ;
mRga, mayUramulu munnu taamemta ;
tapamuna kannaya sannidhi pomdinawO! : ||
;
mOwi chiwuruna allade wENuwu ;
wENuwu payina chiwuru wELLu ;
mumdu janmamuna 'muraLi
' taanemta ; puNya BAgyamunu pomdi yumDenO : ||
;
gaLamuna aaDeDu puuwuladmDalu
muddiDu tanuwuna aladina gamdhamu ;
namdanamdanuni kammani taawula ;
kaugiLulosagina puurwa sukRta memtaTidO!: ||
;
[ SriikrRshNa geetaalu 67 pEjii 72 ] ; [ శ్రీక్రృష్ణ గీతాలు 67 పేజీ 72 ]
No comments:
Post a Comment