పల్లవాధరల పులకలు రేపిన ;
వ్రజబాలుడు ఏడి? .......
;
అల్లనల్లన ఇదె వచ్చెనని ;
ఘల్లు ఘల్లుమను మువ్వలు తెలుపగ ;
"అల్లడుగో!" - యని సవ్వడి చేయక ;
మాటున దాగి .........
తటాలున పట్టగ చూసినంతలో ........
"ఏడీ ఏడీ నల్లనివాడు?
మల్లియలారా! తెలుపరె మీరు!"
;
"ఎక్కడ? ఎక్కడ? శిఖిపింఛధారి?
మబ్బుపింజలలో దాగున్నాడా ;
;
విచ్చిన కేకీపింఛము దాచెనో?
నింగిని పూసిన తారకలారా! :
;
పక్కన నిలిచిన చుక్కలరేడా!
పరుగులు తీసే పద్మనాభుడా! ;
మీరైనా ఆ శ్యామసుందరుని ;
జాడలు తెలుపరె , జాలిగొని ||
;
========================,
;
allarimuwwalu ;-
;
pallawaadharala pulakalu rEpina ;
wrajabAluDu EDi? ....... ;
allanallana ide wachchenani ;
Gallu ghallumanu muwwalu telupaga ;
"allaDugO!" - yani sawwaDi chEyaka ;
mATuna daagi ......
taTAluna paTTaga chUsinamtalO ........
"EDI EDI nallaniwADu?
malliyalArA! telupare
mIru!" ||
"ekkaDa? ekkaDa? SiKipimCadhAri?
mabbupimjalalO dAgunnaaDA ;
;
wichchina kEkIpimCamu dAchenO?
nimgini puusina taarakalArA! :
;
pakkana nilichina chukkalarEDA!
parugulu tIsE padmanABuDA! ;
miirainaa A SyAmasumdaruni ;
jADalu telupare , jAligoni ||
;
[ పాట 70 ; బుక్ పేజీ 75 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment