ఏమి కావాలో చెప్పవోయీ కృష్ణ!
కాస్త చెప్పవోయీ కృష్ణ! ||
షడ్రసోపేతముల విందులే కావలెనా!? క్రిష్ణ!
శబరి ఒసగిన పళ్ళు చాలునంటావా!? ||
;
ఉట్టిపై క్షీరములు కోరెదవు, బాలుడా!
నేస్తులతొ జెట్టీలు పెట్టుకుంటావు ; ||
;
గోరంత వెన్నను మోమంత పులుముకుని ;
వేణు రవళిగ మోవి చిరు నగవులిస్తావు! ||
;
[ క్రిష్ణ మురళి];-
==========================
;
shaDrasOpEtamula wimdulE kaawalenA!? krishNa!
Sabari osagina paLLu chaalunamTAwA!? ||
;
uTTipai ksheeramulu kOredawu, bAluDA!
nEstulato jeTTIlu peTTukumTAwu ; ||
;
gOramta wennanu mOmamta pulumukuni ;
wENu rawaLiga mOwi chirunagawulistaawu! ||
No comments:
Post a Comment