రాధ ఒంటరిదంటు పంచభూతములార!
అంచెలంచెల మీద ;
తుంటరి గోవింద గోపాల క్రిష్ణునికి ఇపుడు ;
రయ రయమున తెలుపరే!!
గోముగా ; సత్వరము తెలుపరే! : ||
;
రాధా వేణీ మేఘమాలికలు ;
నీలమేఘ వినీలశ్యాముని ;
స్పర్శకు అయినా నోచ లేదనీ ;
హేళన ఎందులకే?
ఓ పూర్ణిమావరణ రజనీకాంతా!? :
అవహేళన ఎందులకే? : ||
;
రాధిక మువ్వల రవళికి తోడుగ ;
తన మురళీరవము లేదేమంటూ ;
అడగండే, ఆ వేణువినోదుని ;
ఓ కువలయ వలయ తోయములార! : ||
;
"రాధిక కరముల కౌగిలి చెరసాల
ఇపుడు ,
శూన్యముగాను ఉన్నదేమ"నీ -
అడగండే నిలదీసి గట్టిగా ; ||
తెలుపండే ఆ కుంజవిహారికి ;
ఓ లతా నికుంజ కింజల్కములార! : ||
;
=================================,
;
praSnalu wEyarE! ;-
;
raadha omTaridamTu pamchaBUtamulAra!
amchelamchela meeda ;
tumTri gOwimda gOpaala krishNuniki ipuDu ;
raya rayamuna teluparE! :
gOmugaa satwaramu teluparE! : ||
;
raadhaa wENI mEGamaalikalu ;
neelamEGa wineelaSyAmuni ;
sparSaku ayinA nOcha
lEdanii ;
hELana emdulakE?
O pUrNimAwaraNa rajanIkAmtaa!? ;
awahELana emdulakE? : ||
;
raadhika muwwala rawaLiki tODuga ;
tana muraLIrawamu lEdEmamTU ;
aDagamDE, aa wENuwinOduni ;
O kuwalaya walaya tOyamulaara! : ||
;
raadhika karamulakaugili cherasaala
ipuDu ;
SUnyamugaanu unnadEmanii -
aDagamDE niladeesi gaTTigaa ;
telupamDE aa kumjawihaariki ;
O lataa nikumja kimjalkamulaara! : ||
- [ పాట 71 ; బుక్ పేజీ 76 ; శ్రీకృష్ణగీతాలు ] ;
No comments:
Post a Comment