Tuesday, October 4, 2016

ధ్యానమాధురి

భువన మనోహర సుందర శ్యామా! ; 
నిను గని మరుడే మైమరచేరా! ;   ||భువన||
;
యమునాతీర సైకత వేదికలందున ; 
ఎగసెను నీ తలపుల లహరులు ;  ||భువన|| 
;
బృందావనమున, 
  రా చిలుకల పలుకులు ; 
    మధురములాయెను ;
శ్రీరామచిలుకల ఎల పలుకులు ; 
  నీ ధ్యానమందున మధురములాయెను ;   ||భువన||
;
గోకుల కానన పుంజములోన ; 
హరిణాక్షుల చూపు డోలల నీ రూపేరా!;  
తరుణుల వీక్షణ ఊయెలలందున 
ఊగును నిరతము నీ రూపేరా!;   
;
==============================;

              dhyaanamaadhuri ;- 
;
Buwana manOhara sumdara SyaamA! ; 
ninu gani maruDE maimarachErA! ;   ||bhuwana||
;
yamunaateera saikata wEdikalamduna ; 
egasenu nii talapula laharulu ;  ||bhuwana|| 
;
bRmdAwanamuna, 
 raa chilukala palukulu 
   madhuramulaayenu 
Sreeraamachilukala ela palukulu ; 
  nii dhyaanamamduna 
   madhuramulaayenu ;   ||bhuwana||
;
gOkula kaanana pumjamulOna ; 
hariNAkshula chuupu DOlala nI ruupEraa!
taruNula weekshaNa uuyelalamduna 
uugunu niratamu nI ruupEraa!;   ||bhuwana||
;
రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ రాఁ 

                                 పాట  63 ; బుక్ పేజీ 68  ]    శ్రీకృష్ణగీతాలు   ;  
;
*****************************************, 

No comments:

Post a Comment