Monday, October 10, 2016

శంఖం స్నేహం

సాగర స్వాగత గీతమ్ములను 
నిధి నిక్షేపమ్ములుగా  -  
తన హృదయంలో దాచుకున్నది  
ఈ శంఖమ్ము!

సావధానముగ మన చెవిలోనికి 
జలధి ఘోషమును వినిపిస్తూన్నది ;   || 

సముద్ర ఘోషను ; తన గుండెలలో
ఒడిసిపట్టిన ఆ నేర్పు శంఖముకు
ఎట్లా లభించినదో తెలుసా మీకు!? ;   || 

అల్లరిపిల్లలు చిచ్చర పిడుగులు
నత్త గుల్లలను , చిల్ల పెంకులను,
ఇసుకరేణువులను ఏరుకొనేరు 
అనుకోకుండా దొరికెను శంఖువు ;   || 

సంతోషముతో ఒదిగెను శంఖము 
సంబరమ్ముల బాలల దోసిట! 
బాల బాలికల స్పర్శ శక్తి అది! 
శంఖము ప్రజ్ఞ ఇనుమడించినది! ;   || 

==================;

                   Samkhammu ; - 

saawadhaanamuga mana chewilOniki ; 
jaladhighOshamunu winipistuunnadi ;;   || 
;
samudra ghOshanu ; 
tana gumDelalO ;
oDisipaTTina aa nErpu samkhamuku ; 
eTlaa labhimchinadamDI!? ;   || 
;
allaripillalu chichchara piDugulu ;
natta gullalanu , chilla pemkulanu
isukarENuwulanuu ErukonEru ; 
anukOkuMDA dorikenu Samkhuwu ;   || 
;
samtOshamutO odigenu Samkhumu ; 
sambarmmula baalala dOsiTa!
baala baalikala sparSa Sakti adi!
samkhamu praj~na inumaDimchinadi! ;   || 
;

No comments:

Post a Comment