Showing posts with label చమత్కార. Show all posts
Showing posts with label చమత్కార. Show all posts

Tuesday, October 18, 2016

సిగ్గుల మొగ్గ

అరుణాధర మధుసూదను ; 
వచనోక్తుల మాధుర్యము ; 
మదిలోన రేపేను ; 
పులకరింతలు, గిలిగింతలు :  ||  
బంగరు తునుకవు, నిను జూసి ; 
ఆ జాబిలి తునక ; నీలి నింగిలో 
మబ్బుల తునకల మాటునందున ; 
మొగమును చాటు చేసిన దనెనే! 
                   కృష్ణ పలుకులా!? 
                      అవి, వెన్న ముద్దలా!? :  ||
;
సుగంధ కాంతివి, నిను జూసి ; 
ఆ మెరుపు తీగెలు ; 
చీకటి తెరల మాటున ;  
సిగ్గుల మొగ్గలు ఐనవనేటి ; 
                   కన్నని మాటలా!? - అవి, 
                      "వెన్నెల చక్కెర చిలకలా!?" ;   ||
;
=======================;

          siggula mogga ;-
aruNAdhara madhusuudanu ; 
wachanOktula maadhuryamu ; 
madilOna rEpEnu ; 
pulakarimtalu giligimtalu :  ||
;
bamgaru tunukawu, ninu juusi ; 
aa jaabili tunaka ; neeli nimgilO 
mabbula tunakala mATunamduna ; 
mogamunu chATu chEsina danenE! 
kRshNa palukulA!? 
awi, wenna muddalA!? :  || 
;
sugamdha kaamtiwi, ninu juusi ; 
aa merupu teegelu ; 
cheekaTi terala mATuna ;  
siggula moggalu ainawanETi ; 
kannani  mATalA!? 
awi, "wennela chakkera chilakalaa!?" ; 
wennuni chakkani pakapaka nawwulA!? :  ||
;
 [ pEjee 82 pATa 77]      [ పేజీ 82 పాట 77]  

Friday, May 27, 2016

Yankee - అంటే ఏమిటి?

కొన్ని సార్లు కొన్ని ప్రాంతాల వారికి అనుకోకుండా వింత పేర్లు ఏర్పడుతూంటాయి 
వీటిని తుంటరి పేర్లు, ముద్దుపేర్లు, nick names అనవచ్చును.
త్రిలింగ దేశీయులం కాబట్టి మనం "తెలుగు వాళ్ళం" ఐనాము. 
అట్లాగే ఆంధ్రదేశస్థులం, కనుక "ఆంధ్రులు" ఆంధ్రజాతి వారము - ఐనాము.
తమిళులకు "అరవ వాళ్ళు" అనే పేరు వచ్చింది, 
అసలు హేతువు ఏమిటో స్పష్టంగా తెలీదు.  
&&&&&&&&&&&&,
ఆధునిక కాలం ఇది.
నేడు ప్రపంచం ఒక ఊరు, గ్రామం - ఐనది.
దేశ, విదేశాల సంస్కృతుల మధ్య రేఖలు చెరిగిపోతున్నవి.
అమెరికాలో వాడుకలో ఉన్న పదజాలం, విద్యావంతులు - 
వెంటనే చెప్పేస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో బాగా వాడుకలో ఉన్న పదాలలో ఒకటి "యాంకీ".
Yankee గురించి ఒక డూడుల్ ఉన్నది.
ఆ హాస్య poem ఇదిగో! ఇటు చదవండి.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

A humorous aphorism attributed to E. B. White 
summarizes the following distinctions: 
To foreigners, a Yankee is an American.
To Americans, a Yankee is a Northerner.
To Northerners, a Yankee is an Easterner.
To Easterners, a Yankee is a New Englander.
To New Englanders, a Yankee is a Vermonter.
And in Vermont, a Yankee is somebody who eats pie for breakfast.
;
Another variant of the aphorism replaces the last line with: 
"To a Vermonter, a Yankee is somebody who still uses an outhouse". 
There are several other folk and humorous etymologies for the term.

&&&&&&&&&&&&

అన్నట్లు, మన దేశంలో 1980 ప్రాంతాలలో
"Yankee Doodle" అనే పేరుతో ఐస్ క్రీమ్ popular ఐ ఉన్నది.  
;
==================================,
యాంకీ / Yankee -?  ;
konni saarlu konni praamtaala waariki anukOkumDA wimta pErlu ErpaDutuumTAyi 
weeTini tumTari pErlu, muddupErlu, #nick names# anawachchunu.
trilimga dESIyulam kaabaTTi manam "telugu waaLLam" ainaamu. aTlaagE aamdhradESasthulam, kanuka "aamdhrulu" / aamdhraajaati waaramu - ainaamu.
tamiLulaku "arawa wALLu" anE pEru wachchimdi, asalu hEtuwu EmiTO spashTamgA telIdu.  
&&&&&&&&&&&&&&&&&&,
aadhunika kaalam idi.
nEDu prapamcham oka uuru, graamam - ainadi.
dESa, widESAla samskRtula madhya rEKalu cherigipOtunnawi.
amerikaalO wADukalO unna padajaalam, widyaawamtulu - wemTanE cheppEstunnaaru.
yunaiTeD sTETs aaph amerikaa lO baagaa wADukalO unna padaalalO okaTi "yAmkI".
/ gurimchi oka DUDul unnadi.
aa haasya poem idigO! iTu chadawamDi.

**************************************,

;
అఖిలవనిత 35939=- 863 posts, on May 26, 2016  

Thursday, May 19, 2016

గుప్పెడు పింఛముల గుత్తి


"ఏమర్రా! నే కొట్టిన గోటీ బిళ్ళ ఏది?"
"అదిగో అక్కడ!" చూపించాడు శ్రీ బాలకృష్ణుడు; 
"నా వామనగుంటల బాడిస గింజలు ఏవి? ఎక్కడ?"
"అదిగో అక్కడ!" చూపించాడు కృష్ణ మూరితి ;

"మా పెంపుడు మయూరి పురిలో పింఛాలు 
ఏవీ? ఎక్కడ?"  అడిగినవాడు ఈ పగిది
అందాల బాల క్రిష్ణమ్మ! 

"ఇవిగో ఇక్కడ!" పకపక నవ్వుతు 
చూపించారు గొల్లభామలు
దాచిన ఈకలు తెచ్చిరి పడతులు ; 
దాచిన నెమలి కన్నులు చూపిరి;

గుప్పెడు గుప్పెడు పింఛములు ; గుత్తిగ పట్టి; 
కృష్ణుని సిగముడినందు 
ఉంచినది నవ్వుతు రాధిక!

==============================================,

"EmarrA! nE koTTina gOTI biLLa Edi?"
"adigO akkaDa!" chUpimchaaDu SrI bAlakRshNuDu; 
"naa waamanagumTala bADisa gimjalu Ewi? ekkaDa?"
"adigO akkaDa!" chUpimchaaDu kRshNa muuriti ;

 aDiginawaaDu ii pagidi
amdaala baala krishNamma! 
"mA pempuDu mayUri purilO pimCAlu EwI? ekkaDa?" 
"iwigO ikkaDa!" pakapaka nawwutu 
chuupimchaaru gollabhaamalu
daachina iikalu techchiri paDatulu ; 
daachina nemali kannulu chuupiri;

guppeDu guppeDu pimCamulu ;
guttiga paTTi; 
kRshNuni sigamuDinamdu umchinadi nawwutu raadhika!

*************************************************,

అఖిలవనిత
Pageview chart 35820 pageviews - 852 posts, last published on May 17, 2016

Monday, May 16, 2016

ఎపుడో ఏమో గానీ ........

వర వర్ణిని రాధికా!!
గమనించవు దేనినీ!
       పలు వింతలు, విచిత్రములు
                 సృష్టిలోన ఏర్పడినవి! 
                        వర వర్ణినీ! రాధికా!!|| 
;
~ తటాకముల తరంగములు ; 
  చిరు హొయలులు నేర్చెను ; 
                  ఎపుడో ఏమో గానీ!  
~ నీ కురులందలి 
సొగసరి - చలనముల చతురతలను  ;  
     ఎపుడో ఏమో గానీ 
          ఒడుపుగాను నేర్చినవి!  ॥  

~ హరిణముల నయనద్వయి ; 
   తరళ సొబగులందినవి; 
                ఎపుడో ఏమో గానీ! 
~ నీదు వీక్షణముల 
      తరుణ సుందరములను 
          ఎపుడో ఏమో గానీ  
                పుణికి పుచ్చుకున్నవి   || 

==================,

# warawarNini, raadhikA!
gamanimchawu dEninii!
palu wimtalu, wichitramulu
sRshTilOna ErpaDinawi!
     warawarNiniఐ! raadhikA! || 
;   
 ~ taTAkammula taramgamulu ; 
chiru hoyalulu nErchenu; 
epuDO EmO gAnI! ; 
nErchenu ; 
epuDO EmO gAnI!
;
 ~ nee kurulaamdali ; sogasari - 
chalanamula chaturatalanu ; 
  epuDO EmO gAnI , 
        oDupuganu nErchinawi !  || 
;
~ hariNamula nayanadwayi ;
    taraLa sobagulamdinawi; 
      epuDO EmO gAnI ;
;

~ needu weekshaNamula; 
     taruNa sumdaramulanu; 
         epuDO EmO gAnI ; 
           puNikipuchchukunnawi!  || 

                
------- [ ఎపుడో ఏమో గానీ ; = #  epuDO EmO gAnI ; #]

 అఖిలవనిత
Pageview chart 35786 pageviews - 850 posts, last published on May 11, 2016

Friday, March 25, 2016

సోలంకి, పాలరాతి ధూళి కూలీ

కుమార పాల్ సోలంకి :-  జైనుల కోవెలలు = 
దేరసరస్లను , బసడి లను అద్భుతంగా నిర్మించిన చక్రవర్తి.  
జైన ఆరామములకు 
1. దేరాసరస్ [(derasaras) ]
2. బసడి - అని పేరు.  

&&&&&&

శత్రుంజయ = అంతః = 
మనసును పీడించు శత్రువులను జయించిన మనిషి అని అర్ధం. 
ఈ 'శత్రుంజయ' కు 108 పర్యాయ నామావళి కలవు, 
కానీ కొన్ని పేర్లు మాత్రమే వాడుకలో ఉన్నవి. 
పలిటానా జిల్లా, భావనగర్ పట్టణములకి 
నడుమ శత్రుంజయ నది ప్రవహిస్తున్నది.
కొండ మీద 860 జైన కోవెలలు - 
తొలి వెయ్యి అద్భుతములలో ఒకటిగా పరిగణిస్తున్నారు. 
11 వ శతాబ్దము నాటి నిర్మాణాలు. 
రిషభదేవ తీర్ధంకరుడు నుడివిన 
మొదటి పవిత్ర వాక్కులను భక్తులకు ఇక్కడ అనుగ్రహించుట జరిగింది. 
కనుక ఈ గిరి -  'రిషభదేవకు అంకితం ఈయబడినది. 
అన్య మతస్థుల దుష్టత్వానికి గురి అయినవి ఈ ఆలయాలు. 
తర్వాతి కాలమున 
సమర షా,  శ్వేతాంబర జైనులు, హీర విజయసూరి 
మున్నగువారు పునరుద్ధరణ  గావించారు.  
;జైన ఆరామములలో రకములు :- 
దేరాసరస్; బసడి - లూనా వాసహి, విమల వాసహి - మౌంట్ ఆబూ; 
;
] శిఖర్ బంది  ; ఘర్ = గోపురం లేని నిర్మాణముగా ఉన్న  గుడి 
;
&&&&&&
;
కుమార పాల్ సోలంకి గొప్ప జైన కళాపోషకుడు. 
కుమార సోలంకి ఈ గుళ్ళు కట్టిన పద్ధతిని, 
నిర్వహణాసామర్ధ్యానికి ఉపమానంగా చెబ్తున్నారు.
శిల్పుల దక్షతకు కూలీగా ధనానికి మారుగా 
అతడు, కళాకారులకు ఇచ్చిన మూల్యాన్ని - 
చరిత్రనందు అండర్ లైను చేయవలసిన 
విషయాల పట్టికలలోనికి చేరింది.
;
&&&&&&
;

ఇంతకీ అదేమిటి? :-
ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఇల్పులు, శ్రామికులు, వారు 
ఆ నాటికి - చలువ రాయి నుండి -చెక్కుతారు కదా! 
ఆ చెక్కిన శిల్పాల వలన 
పాలరాయిలలో నుండి ధూళి వస్తుంది. 
పాలరాతి ధూళికి ఎంతో విలువ ఉన్నది. 
కాబట్టి గృహోన్ముఖులౌతూన్న కూలీలకు 
'లభించు కూలీ - పాలరాయి ధూళి' ;            
ఈ నిబంధన వలన అనేక లాభాలు ఒనగూడినవి.
రాళ్ళను ఎంత సన్నగా, చిన్నగా చెక్కితే 
అంత ఎక్కువ రాతి దుమ్ము, గుజ్జు వెలువడుతాయి అన్న మాట. 
ఇందువలన శిల్పులు, లతలు, పువ్వులు, పుష్పదళాలు 
ఇత్యాది అంశాలను అతి సూక్ష్మంగా, మినియేచర్లు 
అంత నైపుణ్యంగా చెక్కారు.
;
ఈ 'టుక్స్', దేసరస్, కోవెలల కుడ్య, గోపురములపై, 
అణువణువునా కనిపిస్తుంది. 
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ :-
చమత్కారమైన ఐడియా ఇది!
సోలంకి ప్రవేశపెట్టిన కొత్త విధానంతో 
శిల్పులలో అంతర్గతంగా ఉన్న ప్రతిభ, 
ప్రజ్ఞా పాటవములు మెరుగులు దిద్దుకున్నవి.
ఫలితంగా మనకు ఈనాడు

నయన పర్వాన్ని కలిగిస్తూన్న జైన కోవెలలలను లబ్ధి కలిగినవి. 
;
&&&&&&
;
పాలరాతి ధూళి - శిల్పులకు కూలీ : 

1. కర్నాటక సంగీతం లోని 72 మేళకర్త రాగాలు ;- 
     'శ్రీ సరస్వతీ మేళకర్త  రాగ ' చిత్ర పటం
2. కటపయాది సూత్రం - 

Monday, October 12, 2015

"వజ్రబంధము"- song గణపతి సచ్చిదానందస్వామి

శ్రీమతి కుసుమా పిడూరి గారు వజ్రబంధమను గణపతి సచ్చిదానందమునివర్యుల కన్నడములోని ఒక పాటగుఱించి అడిగారు. 
కన్నడ మాతృక, అదే అమరికలో నా తెలుగు అనువాదమును అందిస్తున్నాను. ఈ పాటను కూడ అదే మెట్టులో పాడుకొనవచ్చును.
ఇందులో మొదటి తొమ్మిది పంక్తులలో ఒకటినుండి తొమ్మిది అక్షరములు ఉన్నాయి. తొమ్మిదినుండి పదిహేడవ పంక్తులలో తొమ్మిదినుండి ఒక అక్షరమువఱకు ఉన్నాయి. అనగా మొదటి అర్ధములో స్రోతోవాహయతి (నది ఎలా విశాలమవుతుందో ఆ విధముగా), తఱువాతి అక్షరాలు గోపుచ్ఛయతిలో (ఆవు తోకలా వెడల్పునుండి సన్నగా అవడము) ఉన్నాయి. ఇలాటివి దీక్షితులవారు రచించారు.:- 

శ్రీ
కృష్ణా 
గోపాలా 
ముకుందన
కాణబేకెంబ 
నన హంబలవు
కనసినలి కండె
కణమరెయాదనవ
కృష్ణనే సచ్చిదానందను
దీనవరకర నవ
ననగె నీనే గతి
భక్త వత్సలనే
నన్నస్వామి నీ
జయవెందె
నిన్నయ
లీలె
గె
శ్రీ
కృష్ణ 
గోపాలా 
ముకుందుని 
కాన నెంచంగ 
నగు కోరికను 
కల నడుమ గంటి 
కనుమఱు గయ్యె గద
కృష్ణుడే సచ్చిదానందుడు 
దీనవరదు డతడు
ఎపుడు నీవే గతి
భక్తవత్సలుడా 
నాదు స్వామి నీ
జయ మంటి 
నీదగు 
లీల 
కు
*********************************;

[ విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు ] { F.B. Group - సాహిత్యం [ 8:30 AM 10/1/2015]}

"వజ్రబంధము"- song గణపతి సచ్చిదానందమునివర్యులు
*********************************;
  taramgamulu 

,

Friday, January 16, 2015

కొమ్మ విరుగుతుందేమోనని?

పొన్నచెట్టు, పొగడచెట్టు; ఆకు పువ్వులు, 
పిందెలు, ఫలములు నిండుగా; 
ఆ - కొమ్మలలోన కొమ్మ కొక్క గూడు; 
గూటి గూటిలోన కిలకిలల పక్షుల్లు;
బారు కొమ్మలందున ఇంద్రధనుసులు 
ఎట్లు వెలసెనమా? అవి ఎట్టులమ్మా!?-

గోపెమ్మల వలువలన్ని, 
పిల్లంగ్రోవి రవళి - పసి కట్టితిమమ్మా! ఓ అమ్మలార! 
అడుగడుగో గోపాలుడు, ఆ నవ్వుల సవ్వడి!
గోపెమ్మల వలువలన్ని తెచ్చిపెట్టినాడే, 
తన నగవులనన్నిటినీ ఆరబోస్తున్నాడే!

ఆ చేతిలోన ఉన్నదిలే మువ్వల మురళి! 
క్రిష్ణు చివురుచరణాల; 
రవధూళి, గోధూళి, సందె ధూళులు, 
తలను దాల్చి, మీరైనా చెప్పండమ్మా కొంచెం
'కొమ్మ విరుగుతుందేమోనని? చెప్పండీ వానికి; 
  శాఖల చిలకల్లారా! 
     కొమ్మల కోయిలలారా! 
         మైనా, గొరువంకలార!
అల్లరులను మానమనీ, వంకరపనులొద్దనీ, 
మిడిసిపాటు తగదనీ, కొమ్మ విరుగునేమో - అని
సుద్దులను చెప్పండి కాస్త!

*******************************
 carpet designs











నా బ్లాగులు :-
ponnacheTTu, pogaDacheTTu; 
aaku puwwulu, 
pimdelu, phalamulu nimDugaa; 
aa - kommalalOna komma kokka gUDu; 
gUTi gUTilOna kilakilala pakshullu;
gOpemmala waluwalanni, 
imdradhanusulu welase, 
adi eTTulammA!?-
pillamgrOwi rawaLi - 
pasi kaTTitimammaa! 
        - O ammalaara! 

aDugaDugO gOpaaluDu, 
A nawwula sawwaDi!
aa chEtilOna unnadilE 
muwwala muraLi! 
krishNu chiwuru charaNAla; 
rawadhuuLi, gOdhuuLi, samde dhuuLi, 

talanu daalchi, cheppamDammaa waaniki; 
 -SAKala chilakallaaraa! 
  -kommala kOyilalaaraa! 
   -mainaa goruwamkalaara!
allarulanu maanamanii, 
wamkarapanuloddanii, 
miDisipaaTu tagadanii, 
komma wirugunEmO - ani
suddulanu cheppamDi kaasta,

 Total Pageviews; Sparkline 29,380 
అఖిలవనిత
Pageview chart 29380 pageviews - 755 posts, last published on Jan 15, 2015
Telugu Ratna Malika
Pageview chart 3937 pageviews - 126 posts, last published on Jan 14, 2015 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 55727 pageviews - 1005 posts, last published on Jan 13, 2015 - 4 followers

Thursday, September 11, 2014

మాస్కుల యోధులు

ఎవ్వరు?వారెవ్వరు?
ఇపుడే నాకు; చెప్పమ్మా!  ||

ముసుగులవీరుడు ఎవ్వరమ్మా?
సూపర్  మ్యాన్, ఔనా?  ||

స్పైడర్ మాన్, ఔనా కాదా?
టార్జాన్ యోధుడు అవునా అమ్మా!   ||

కథాకళి డాన్సులు నేను నేర్పుతా,
ఆడుదురందరు నాతోటి అప్పుడు-

**************************************************

కాదంబరి కుసుమాంబ ;
Kusuma Piduri

;
మాస్ మాస్కు మజా మజా 













కాదంబరి కుసుమాంబ ;
Kusuma Piduri

Sunday, May 18, 2014

నెహ్రూజీ, నీలం పుస్తకము


ఇండియా తొట్ట తొలి ప్రధాన మంత్రి. బాలలకు ఈయన “చాచా నెహ్రూ”. శాంతిపావురములను ఎగురవేసే  అలవాటు జవహర్ లాల్ నెహ్రూ ద్వారా వ్యాప్తి చెందింది. ఒక సాధారణ వ్యక్తికి జవహర్ లాల్ నెహ్రూ తటస్థపడినప్పుడు జరిగిన సంఘటన ఇది.

మహాన్ సింఘ్ బయస్ ఒక జూనియర్ పోలీసాఫీసర్. 1958 లలో అతను సెక్యూరిటీ డ్యూటీ చెయ్యాల్సివచ్చింది. బోంబే (నేటి ముంబై) దగ్గర తాన్సా అనే ఊళ్ళో భద్రతా విధుల పని పడింది. అక్కడికి వస్తూన్న వ్యక్తి సాక్షాత్తూ దేశ ప్రధాన మంత్రి. ప్రారంభోత్సవ వేడుక ఐపోయింది. నెహ్రూ వేదిక నుండి కిందకు దిగాడు. వెదురు కర్రలతో కట్టిన బారికేడులను దాటి వచ్చారు. ఆయనను కలవాలని ఉబలాట పడ్తూన్న ప్రజల వద్దకు జవహర్ లాల్ నెహ్రూ చేరారు.

జనాలను కంట్రోల్ చేయడం క్లిష్ట సమస్య ఐంది. సింగ్ తన లాఠీ (swagger stick)ని ఝళిపిస్తూ  జవహర్ లాల్ నెహ్రూ వెనుక బయల్దేరారు. గుంపులను అదుపు చేయడం దుస్సాధ్యంగా మారింది. నెహ్రూ చుట్టూ కమ్ముకున్న మనుషులను లాఠీని విసురుతూ, సింగ్ కాపలా కాస్తున్నాడు.

అకస్మాత్తుగా తన చేతిలోని లాఠీని ఎవరో లాగి విసిరేసారు. సింగ్ ఆగ్రహంతో చుట్టూ చూసాడు. తీరా చూస్తే అలా లాగి విసిరేసిన వారెవరో కాదు - జవహర్ లాల్ నెహ్రూ. లాఠీ కఱ్ఱను లాగి తీసుకుని, తన వైపు చూపిస్తూ అడుగుతున్నాడు-

“ఏమిటి నువ్వు చేస్తూన్న పని?”

నెహ్రూ కరకుగా అడిగాడు. అలా కర్కశంగా అరిచి, వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కి ఆర్డర్ జారీ చేసాడు-“ఈతనిని ఈ పని నుంచి పంపిచేసేయండి.”

కనురెప్పల కరకట్టలను దాటి వస్తూన్న కన్నీళ్ళను ఎలాగో ఆపుకుంటూ అక్కడి నుండి మహాన్ సింఘ్ బయస్ నిష్క్రమించారు.

******

కాస్సేపటి తర్వాత తర్వాత ప్రైమ్ మినిష్టర్ నుంచి సింగ్ కి ఆదేశం (సమ్మన్లు) వచ్చింది. “నా ఉద్యోగానికి ముప్పు వచ్చింది.” అనుకుంటూ గడగడ వణుకుతూ అక్కడికి చేరారు సింగ్.

మొరార్జీ దేశాయి, తతిమ్మా లీడర్లతో   కూర్చుని ఉన్నారు నెహ్రూ.    

“నువ్వేం చేద్దామనుకున్నావు??” సింగ్ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఎలాగో పలికాడు – నత్తి నత్తిగా ఇలాగ “సర్! బ్లూ బుక్ ను నేను ఫాలో అయ్యాను.”

Blue Book  ప్రముఖ వ్యక్తులు (VVIP security measures) వచ్చినప్పుడు వాళ్ళకు భద్రత ఎలాగ కల్పించాలో తెలిపే బుక్. సెక్యూరిటీ ప్రమాణాలను వివరిస్తూన్న విధుల నియమావళి పట్టిక రాసి ఉంచిన పుస్తకము                                                  

సెక్యూరిటీ ఆఫీసర్, మొరార్జీ దేశాయి లు ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి కొంచెం వివరంగా చెప్పారు.

నెహ్రూ కొంతసేపు మౌనంగా ఊరుకున్నారు. ఒక క్షణం ఊరుకున్న తర్వాత తల పంకిస్తూ అన్నారు “యంగ్ మాన్! వాస్తవం చెప్పాలంటే నువ్వే రైటు. నాదే పొరపాటు. అయాం సారీ!”

మహాన్ సింగ్ బయస్ ఆ సంఘటనను తలుచుకుంటూ చెబ్తూంటారు,

“కేవలం ఒక junior police officer వద్ద తన తప్పును ఒప్పుకునారు అంతటి ప్రధాన మంత్రి. అలాగ తన తప్పును తాను తెలుసుకుని, వెంటనే పశ్చాత్తాపంతో నెహ్రూజీ ఆడిగారు. అదే ఆయన గొప్పదనము.”

పండిట్ జీ అలాగ సారీ చెప్పగానే అప్పటిదాకా బిగబట్టున్న అశ్రువులు ధారాపాతంగా వెలువడినవి.

“ఈసారి నేను నా కళ్ళలో నీళ్ళను ఆపుకోవడానికి ప్రయత్నించ లేదు. అవి ఆనందబాష్పాలు కదా మరి!”

*******
జవహర్ లాల్ మరియు బ్లూ బుక్
User Rating:  / 1
Member Categories  - తెలుసా!
Written by kadambari piduri
Thursday, 01 May 2014 10:00
Hits: 197

అఖిలవనిత
పేజీ వీక్షణ చార్ట్ 26445 పేజీవీక్షణలు - 716 పోస్ట్‌లు, చివరగా Apr 24, 2014న ప్రచురించబడింది
Telugu Ratna Malika
పేజీ వీక్షణ చార్ట్ 3507 పేజీవీక్షణలు - 116 పోస్ట్‌లు, చివరగా Apr 17, 2014న ప్రచురించబడింది