అరుణాధర మధుసూదను ;
వచనోక్తుల మాధుర్యము ;
మదిలోన రేపేను ;
పులకరింతలు, గిలిగింతలు : ||
;
బంగరు తునుకవు, నిను జూసి ;
ఆ జాబిలి తునక ; నీలి నింగిలో
మబ్బుల తునకల మాటునందున ;
మొగమును చాటు చేసిన దనెనే!
కృష్ణ పలుకులా!?
అవి, వెన్న ముద్దలా!? : ||
;
సుగంధ కాంతివి, నిను జూసి ;
ఆ మెరుపు తీగెలు ;
చీకటి తెరల మాటున ;
సిగ్గుల మొగ్గలు ఐనవనేటి ;
కన్నని మాటలా!? - అవి,
"వెన్నెల చక్కెర చిలకలా!?" ; ||
;
=======================;
siggula mogga ;-
;
aruNAdhara madhusuudanu ;
wachanOktula maadhuryamu ;
madilOna rEpEnu ;
pulakarimtalu giligimtalu : ||
;
bamgaru tunukawu, ninu juusi ;
aa jaabili tunaka ; neeli nimgilO
mabbula tunakala mATunamduna ;
mogamunu chATu chEsina danenE!
kRshNa palukulA!?
awi, wenna muddalA!? : ||
;
sugamdha kaamtiwi, ninu juusi ;
aa merupu teegelu ;
cheekaTi terala mATuna ;
siggula moggalu ainawanETi ;
kannani mATalA!?
awi, "wennela chakkera chilakalaa!?" ;
wennuni chakkani pakapaka nawwulA!? : ||
;
[ pEjee 82 pATa 77] [ పేజీ 82 పాట 77]
No comments:
Post a Comment