Thursday, October 6, 2016

చివురు వ్రేళ్ళు

చివురు వ్రేళుల నొదుగు 
చిరు మురళినైన కాలేదు నేను ; 
నీ ముంగురులందు ఒదిగి 
ఉన్న పింఛమైనా కాలేను నేను :    || 
;
కాను, హరి మేనున అంటి ఉన్న 
'హరిచందనమ్మైన' నేను ; 
హరిమధ్యమును చుట్టి ఉన్న 
శృంఖలమ్మైనా కాను నేను :    || 

పీతాంబరధారి 
చేల చెరగైనా కాకపోతి ; 
పద పద్మముల వాలు ; 
మణి నూపురమ్మైన కాలేదు నేను  :    || 
;
మెడను చుట్టి ఉన్న 
పూల దండనైన కాలేదు నేను ; 
కాను కైదండను కౌగిలించి 
యున్న కేయూరమైన ; 
మదన గోపాలుని కొసగెడు 
తోమాలనైన కాను నేను   :    ||  
;
సందె గోపాలుని కాలిగోటి పైన ; 
తలవాల్చ నోచిన ; 
గడ్డి పూవునైన కాలేక పోతిని ;  || 

==================;
;
         chiwuru wrELLu
;
chiwuru wrELula nodugu 
chiru muraLinaina kAlEdu nEnu ; 
nii mumgurulamdu odigi unna 
pimCamainaa kaalEnu nEnu :    || 
;
kaanu, hari mEnuna amTi unna 
'harichamdanammaina ' nEnu ; 
harimadhyamunu chuTTi unna 
SRKalammainaa kAnu nEnu :    || 
;
piitaambaradhaari 
chEla cheragainaa kaakapOti ; 
padapadmamula waalu ; 
maNi nUpurammaina kAlEdu nEnu  :    || 
;
meDanu chuTTi unna 
pUla damDanaina kaalEdu nEnu 
kaanu kaidamDanu 
kaugilimchi yunna kEyuuramaina ; 
madana gOpAluni kosageDu 
tOmAlanaina kAnu nEnu :  
;
samde gOpaaluni kaaligOTi paina ;
talawaalcha nOchina ; 
gaDDi pUwunaina kaalEka pOtini ;  ||  

****************************
[  పేజీ - 73 ; శ్రీక్రృష్ణ గీతాలు 68  ]

No comments:

Post a Comment