సతతహరిత పర్ణకుటీరమిది;
క్రిష్ణయ్యా! రావయ్యా! ; ||
;
నీ అడుగులేమొ నడకలు;
నడకలేమొ నాట్యాలు ;
ఇన్ని లీలలన్నిటినీ
విశదపరచు కుటీరం ;
పచ్చనాకుల కుటీరం ; ||
;
అంబరమున
ఆ మొయిలులు;
తమ చలనములకు;
నృత్యహేలలను
నేర్పే గమ్మత్తులు ; ||
;
వంపు, ఇంపు, సొంపు త్రికముల ;
గైకొనినవి నీలాల నింగి మబ్బులు;
అమ్మ వోలె అనుభూతి
చెందుచున్న అంబరము
విశాల నీలి అంబరము ; ||
;
[మాతృభావన]
==============================,
;
వంపు, ఇంపు, సొంపు త్రికములు ;
No comments:
Post a Comment