వందనములు, వందనములు, ;
వందలాది వందనములు,
అరవిందలోచనుడా!
అరమోడ్పు కన్నుల రాధ చేసేటి ; ||వందనములు||
;
చందనములు, చందనములు;
చల్లని హరి చందనములు ;
కందర్పమోహన!
కెందలిరాకు మోవి రాధ అలదేటి ; ||చందనములు||
;
మాలికలు మాలికలు ;
చక్కని పూ మాలికలు ;
రాధా హృత్ వనమాlee!
ఈ రాగ సుధా మానస మర్పించే ||మాలికలు||
;
వెన్నపాలు, వెన్నపాలు ;
కమ్మనైన వెన్నపాలు ;
వెన్నదొంగకు నేడిటు ;
అన్నులమిన్న రాధ ;
ఒసగు నవనీతపు విన్నపాలు ; ||వందనములు||
;
=========================,
;
annulaminna ;-
wamdanamulu, wamdanamulu,
wamdalaadi wamdanamulu,
arawimdalOchanuDA!
aramODpu kannula raadha chEsETi; ||wamdanamulu||
;
chamdanamulu, chamdanamulu;
challani hari chamdanamulu;
kamdarpamOhana!
kemdaliraaku mOwi raadha aladETi; ||chamdanamulu||
;
maalikalu maalikalu;
chakkani puu maalikalu;
raadhaa hRt wanamaali!
I raaga sudhaa maanasa marpimchE ||maalikalu||
;
wennapaalu, wennapaalu;
kammanaina wennapaalu;
wennadomgaku nEDiTu;
annulaminna raadha;
osagu nawaneetapu winnapaalu ; ||wamdanamulu||
;
[ పాట 61 ; బుక్ పేజీ 66 , శ్రీకృష్ణగీతాలు ]
No comments:
Post a Comment