చతుర్దశ భువనమ్ములు సర్వం ;
క్రిష్ణయ్య నోటిలోన నిక్షిప్తం ;
మా చతురతల క్రిష్ణాస్య గంధ నిక్షిప్తం ||
;
మా పెరటిలోని వెదురు బొంగు ;
తాను ఎదలోన దాచుకొనెను ;
తీపి తీపి రాగములను ;
ఇన్నినాళ్ళుగా మాకు తెలియనే లేదు ;
కన్నయ్య పెదవి ఆని ఆనంగానే -
వంశి కాస్త వేణువైనది వైనంగ ;
ఎంత వింత పరిణామం! ఓహోహొ! ||
;
యుగ యుగమ్ముల నుండీ ;
పాల్కడలిని దాగిఉన్న ;
ఎత్తు రాసుల నవనీతం ;
వంటింటిలోన చిన్ని కుంభంలోన ;
కవ్వంతో రవ్వంత సరస సల్లాపములు
ఆడ నేర్చినది ;
వెన్నముద్ద అయీ జాబిల్లి వోలె
చప్పున తేలి ఆడి వచ్చి;
కన్నయ్య పెదవుల పులుముకున్నాది ;
తన ముద్దు వదనమున అలుముకున్నాది
వెన్న ఆ పైన ముదముతో పకపకా నవ్వినది ||
;
;
------- నవనీతం చతురత / క్షీర జలధిని పాల చమత్కారం
;
============================;
;
chaturdaSa bhuwanammulu sarwam ;
krishNayya nOTilOna nikshiptam ;
maa chaturatala krishNaasya gamdha nikshiptam ||
;
maa peraTilOni weduru bomgunu ;
taanu edalOna daachukonenu ;
tiipi teepi raagamulanu ;
inninALLugA maaku teliyanE lEdu ;
kannayya pedawi aani aanamgaanE -
wamSi wENuwainadi wainamga!
emta wimta pariNAmam! OhOhO! ||
;
yuga yugammula numDI ;
paalkaDalini daagiunna ;
raasula nawaniitam ;
wamTimTini kumbhamlO ;
kawwamtO rawwamta
sarasa sallaapamulu
ADa nErchinadi ;
wennamudda ayii;
jaabilli wOle ;
chappuna tEli ADi wachchi;
kannayya wadanamuna ;
pakapakaa nawwinadi ||
;
No comments:
Post a Comment