Saturday, October 1, 2016

సాహసమేల ఈ లీల జానకీ!

"ఉత్తర రామచరితము" కరుణరసాత్మకమైనది.  భాసుడు రచించిన "ఉత్తర రామచరితము" ప్రసిద్ధము. 
తెలుగులో కంకంటిపాపరాజు కావ్యంలోని పద్యాలు ఆబాలగోపాలము మనసారా ఆస్వాదించినారు. "లవకుశ" మున్నగు సినిమాలలో ఈ పద్యాలనే స్వీకరించారు.;
1934 లో రూపొందించిన "లవకుశ" లోని ఒక పాటను చూద్దామా!!!
లవకుశ [1934] ;-
పాట ;-
;     
సాహసమేల ఈ లీల జానకీ! 
సాహసమేల ఈ లీల జానకీ ! ||
;
వెతబడకే పతిసేవ భాగ్యమొదవు ;
వెతబడకే పతిసేవ భాగ్యమొదవు ;
|| సాహసమేల ఈ లీల జానకీ! 
వినుతచరిత మాతా! ||
;
వినుతచరిత మాతా! 
బేలతనంబేలా!? ; 
వినుతచరిత మాతా! 
బేలతనంబేలా!? ;
;
సుగుణోపేత! సుగుణోపేత! 
స్థిరమా విచారము ;
సాహసమేల ఈ లీల జానకీ
||సాహసమేల ఈ లీల జానకీ 
వెతబడకే పతిసేవ భాగ్యమొదవు||  

@@@@@@@

ఆంధ్రేతరుడైన మోతీలాల్ ఛబ్రియా - ఈ సినిమా నిర్మాత అవడం విశేషం. 
శ్రీరాముడు - పారుపల్లి సుబ్బారావు ; 
సీతాదేవి - శ్రీరంజని ; 
వాల్మీకి మహర్షి - పారుపల్లి సత్యనారాయణ - 
కుశుడు, లవుడు - మాస్టర్ భీమారావు ; మాస్టర్ మల్లేశరరావు ;
నటించిన చిత్రం "లవకుశ" 1934 లో వచ్చినది.  

===================;
1934 ;- పారుపల్లి సత్యనారాయణ, వల్లభ జోస్యుల రమణ మూర్తి ; ప్రభల సత్యనారాయణ, శ్రీరంజని - మాస్టర్ భీమేశ్వరావు ; మాస్టర్ మల్లేశ్వరరావు - మున్నగువారు తారాగణం. 
===================; 

No comments:

Post a Comment