Saturday, October 22, 2016

స్వయంవర మాలిక

జనక రాజ పుత్రిక 
హస్తముల సుమ హారము  
పరిమళములన్ని కళ కళల మన్నిక ; 
కళ కళ కళ కళ - కళ కళ 
కళ కళ - కళ కళ - కళ కళ  ;   || 
;
మదనుని ధనువు పుష్పములు ; 
ధరణికి జాల్వారెను ;
ధరణిజ కర కమలమ్ము 
వెలసినవి వరమాలికగా!! ;   || 
మన్మధుడు తన శరమును ; 
సవరించుకొను లోపునే :  
కొలువునందు చోద్యాలే జరిగెను
ఇటు, విదేహ కొలువునందు 
               చోద్యాలే జరిగెను ;   || 
;
వింటి నారిని తీసి ; 
విలు కొమ్ముకు కట్టబోవ ; 
రాములు, విలు కొమ్ముకు కట్టబోవ 
విల్లు విరెగెనా!? 
మరి, ఏమో వైదేహి కనుబొమ్మలు ; 
విస్మయమున నింగి ఆయెనో!? ;   || 
;
నళినాక్షి వీక్షణముల ఛత్రములు కనుబొమ్మలు!
పట్టు గొడుగులవగ కనుబొమ్మలు ; 
విభ్రమములకు విశ్వమెల్ల కూటమి ఐనది అపుడు!!
అప్పుడు ఆ వింత కనుడు, కనుగొన్నారా!? 
జనులారా!: కనుగొన్నారా!  ;   || 
;

No comments:

Post a Comment