నీ చరణ స్పర్శల
తృణ పుష్పమై
నన్ను - సోలి పోనీ ;
నీదానరా మాధవా!
నీదాన, రా మాధవా! : ||
;
మణికంకణ నిక్వాణములను కోరను ;
కనకమయ భూషణ ధారణము వలదు ;
నీ మురళీరవళియే -
అనంతమైన సుధలూరు "గని"రా! ;
వీనులవిందుగ తరియింపజేయరా!: ||
;
మౌక్తిక ద్యుతి శోభిత సోపానములేల!?;
నవరత్న ఖచిత సింహాసనములేల!?
నీ చరణసన్నిధియె నవనిధుల పెన్నిధిర!
నెన్నుదుట నీ పాద రజమును దాల్చనీవోయీ! : ||
;
====================================;
;
pennidhi ;- nee charaNa sparSala
tRNa pushpamai ;
nannu - sOli pOnI ;
needaanaraa maadhawaa!
needaana, raa maadhawA! : ||
;
maNikamkaNa nikwANamulanu kOranu ;
kanakamaya BUshaNa dhaaraNamu waladu ;
nii muraLIrawaLiyE -
anantamaina sudhaluuru"gani"raa! ;
weenulawimduga tariyimpajEyarA!: ||
;
mauktika dyuti SOBita sOpAnamulEla!?;
nawaratna khachita sim haasanamulEla!?
nee charaNasannidhiye nawanidhula pennidhira!
nennuduTa nee paada rajamunu daalchaniiwOyI! : ||
;
*********************************** ;
[ శ్రీ కృష్ణ గీతాలు ] [ పేజీ 79 ; పాట 74 ]
No comments:
Post a Comment