కడకంటి చూపున
కనికరము చూపవే! ;
కనికరము చూపవే! ;
నీ పాదముల పైన
వ్రాలు ఈ దాసు పైన ;
వ్రాలు ఈ దాసు పైన ;
అన్నాడు నిన్న ;
అది మరచె నేడు! ; ||కడకంటి||
అది మరచె నేడు! ; ||కడకంటి||
;
గోవర్ధన గిరి సానువులన్నీ ;
హిమబాష్పములను కురిపించినవి ;
సానూభూతితో విరహిణి రాధపై
; ఆ పాటైనా కరుణయె లేదే! ;
వాని మాటలు -
ఒట్టి 'నీటి మూటలే'నులే! ; ||కడకంటి||
ఒట్టి 'నీటి మూటలే'నులే! ; ||కడకంటి||
;
ధేను పాంశువుల ధూళిపరాగము ;
ఎర్రబారెనే, నింగి కెగసెనే! ;
ధూర్తబాలుని తలచినట్టుల ;
అంత మాత్రపు కృప లేదే!;
వాడెట్టి ఎండకు
అట్టి గొడుగును పట్టునులే! ; ||కడకంటి||
అట్టి గొడుగును పట్టునులే! ; ||కడకంటి||
;
==========================================;
;
wirahiNi ;-;
;
kaDakamTi chUpuna kanikaramu chuupawE! ;
nii paadamula paina wraalu ii daasu
paina ; annADu ninna ;
adi marache nEDu! ; ||kaDakamTi|| ;
adi marache nEDu! ; ||kaDakamTi|| ;
;
gOwardhana giri saanuwulannii ;
himabaashpamulanu kuripimchinawi ;
saaniBUtitO wirahiNi rAdhapai
; aa pATainaa karuNaye lEdE! ;
waani mATalu -
oTTi niiIi muuTalEnulE!; ||kaDakamTi||
oTTi niiIi muuTalEnulE!; ||kaDakamTi||
;
dhEnu pAMSuwula dhULiparaagamu ;
errabaarenE, nimgi kegasenE! ;
dhuurtabaaluni talachinaTTula ;
amta mAtrapu kRpa lEdE!;
wADeTTi emDaku aTTi
goDugunu paTTunulE!; ||kaDakamTi||
;
ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ ళఌౡ ళళఌౡ ళళఌౡ ళ
;
[ పాట 64 ; బుక్ పేజీ 69 ] శ్రీకృష్ణగీతాలు
No comments:
Post a Comment